Petrol
Petrol Price Hike: పెట్రోల్ ధరలు సెంచరీ దాటినా ధరల పరుగులు మాత్రం ఆగడంలేదు. ఐదు రాష్ట్రాల ఎన్నికల అనంతరం మొదలైన ధరల పెరుగుదల ఇప్పటికీ పైపైకి వెళ్తూనే ఉంది. ఎన్నికల అనంతరం ఇప్పటికి 24 సార్లు పెంచిన చమురు కంపెనీలు శనివారం మరోసారి ధరలు పెంచాయి. దీంతో చమురు ధరలు ఆల్ టైం రికార్డు స్థాయికి చేరాయి. నేడు (జూన్ 12) పెట్రోల్ పై 28 పైసలు, డీజిల్ పై 25 పైసలు ధర పెరిగింది.
దేశంలో ఇప్పటికే చాలా నగరాల్లో పెట్రోల్ ధరలు సెంచరీ దాటగా మరొకొన్ని చోట్ల సెంచరీకి చేరువలో ఉంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, జమ్మూకాశ్మీర్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.100 కంటే ఎక్కువే ఉండగా దేశంలోనే అత్యధికంగా రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.106 పైన పలుకుతుంది. దేశరాజధాని న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.12కు పెరగగా ఆర్ధిక రాజధాని ముంబైలో పెట్రోల్ రూ.102.30గా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలలో ఇప్పటికే ఏపీలో పెట్రోల్ ధర సెంచరీ దాటగా నేడు పెరిగిన ధరతో హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ. 99.90కి చేరింది.