Petrol Rate : తగ్గిన డీజిల్ ధర.. స్థిరంగా పెట్రోల్ ధర

పెట్రోల్ ధరలో ఎటువంటి మార్పు లేదు.. జులై 17వ తేదీ చివరి సారి పెరిగాయి పెట్రోల్ ధరలు. అప్పటి నుంచి స్థిరంగా కొనసాగుతున్నాయి.

Petrol Rate

Petrol Rate : పెట్రోల్ ధరలో ఎటువంటి మార్పు లేదు.. జులై 17వ తేదీ చివరి సారి పెరిగాయి పెట్రోల్ ధరలు. అప్పటి నుంచి స్థిరంగా కొనసాగుతున్నాయి. డీజిల్ ధరలు మాత్రం బుధ, గురు, శుక్రవారాల్లో స్వల్పంగా తగ్గాయి. వరుసగా మూడు రోజులుగా 20 పైసల చొప్పున తగ్గుతోంది. డీజిల్ ధరలు జూలై 15వ తేదీ నుండి స్థిరంగా 33 రోజుల తర్వాత తగ్గింది.

అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ధరలను సవరిస్తాయి. నేడు స్థిరంగా ఉన్నాయి. చివరిసారి లీటర్ పెట్రోల్ పైన 30 పైసలు పెరిగింది. గత నెలలో ఇంధన ధరలు పదిసార్లు పెరిగాయి. ఈ ఆగస్ట్ నెలలో ఇప్పటి వరకు పెట్రోల్ ఒక్కసారీ పెరగలేదు. పైగా, డీజిల్ ధర తగ్గుతోంది. మే నెలలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ధరల పెరుగుదల నిలిచింది. ఆ తర్వాత పలుమార్లు పెరిగినప్పటికీ, జూలై మిడిల్ నుండి పెరుగుదలలేదు.

దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని పెట్రోల్ డీజిల్ ధరలను ఒకసారి పరిశీలిస్తే

ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.101.84, లీటర్ డీజిల్ రూ.89.27గా ఉంది.
ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.107.83, డీజిల్ రూ.97.04గా ఉంది.
మధ్యప్రదేశ్, రాజస్థాన్ లలో పెట్రోల్ ధరలు రూ.110 క్రాస్ చేశాయి.
హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.105.83, లీటర్ డీజిల్ రూ.97.36గా ఉంది.

దేశంలోని చాలా ప్రాంతాల్లో పెట్రోల్ ధర రూ.100 దాటింది. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, అమరావతి, తిరువనంతపురంలలో సెంచరీ కొట్టి నేలపైనే అయింది.