Girl Rape case: బాలికపై అత్యాచారం.. పోలీసుల అదుపులో నిందితుడు
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్, బంజారాహిల్స్‌లోని ఎల్బీ నగర్‌లో ఉంటున్న ఒక బాలిక గత ఏడాది సెప్టెంబర్‌లో ఇంటి నుంచి కనిపించకుండా పోయింది.
- Narender Thiru
- Updated on- June 1, 2022 / 04:27 PM IST
Girl Raped
Girl Rape case: బాలికపై ఐదు నెలలుగా అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఆలస్యంగా వెలుగుచూశాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్, బంజారాహిల్స్‌లోని ఎల్బీ నగర్‌లో ఉంటున్న ఒక బాలిక గత ఏడాది సెప్టెంబర్‌లో ఇంటి నుంచి కనిపించకుండా పోయింది. అప్పుడు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఐదు నెలల తర్వాత పటాన్ చెరువు ప్రాంతంలో వారి బంధువుల ఇంట్లో బాలిక ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. తర్వాత బాలికను కుటుంబ సభ్యులకు అప్పగించారు.
New District Courts: రేపటి నుంచి కొత్త జిల్లాల కోర్టుల్లో సేవలు ప్రారంభం
అయితే, ఈ అయిదు నెలల్లో ఒక వ్యక్తి తనతో పరిచయం పెంచుకుని, అత్యాచారం చేసినట్లు ఆ బాలిక పోలీసులకు తెలిపింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని, నిందితుడి కోసం గాలించారు. అప్పటి నుంచి నిందితుడు తప్పించుకు తిరిగాడు. తాజాగా నిందితుడిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. బాలికను భరోసా సెంటర్‌కు తరలించారు.
