కరోనా మహమ్మారి ఇంకా విజృంభిస్తూనే ఉంది. ఈ వైరస్ బారిన పడి ఎంతో మంది పిట్టల్లా చనిపోతున్నారు. ఇది ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా..పాజిటివ్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఒకరి నుంచి మరొకరికి వైరస్ సోకుతుండడంతో తీవ్ర భయాందోళనలు వ్యక్తమౌతున్నాయి. ఈ వైరస్ ఎవరినీ వదలడం లేదు.
తాజాగా PIB (Press Infermation Bureo) కరోనా కలకలం సృష్టించింది. ప్రిన్స్ పల్ డైరెక్టర్ జనరల్ కేఎస్ ధాట్ వాలియా కరోనా బారిన పడ్డారు. ఈయన ఎయిమ్స్ లో చేరిపించారు. ఈయన ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి ప్రకటన వెలువడలేదు. దీంతో ఢిల్లీలో ఉన్న ఈ ఆఫీసును మొత్తం మూసేశారు. ఈ కేంద్ర భవనాన్ని 2020, జూన్ 08వ తేదీ సోమవారం మొత్తం శానిటైజ్ చేయనున్నారు.
PIB కార్యక్రమాలు, విలేకరుల సమావేశాల నిర్వాహణను ఇక్కడ కాకుండా..శాస్త్రిభవన్ లో నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. పీఐబీ అధికారి ఎవరితో సన్నిహితంగా ఉన్నారు. ? ఎవరెవరితో మాట్లాడారనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. వారిందరికీ కరోనా పరీక్షలు చేయడంతో పాటు..ముందు జాగ్రత్తలో భాగంగా హోం క్వారంటైన్ లో ఉండాలని సూచించారు.