అమెరికా చేరాక మోదీ చేసిన ట్వీట్స్
PM Modi’s tweet after reaching America: అమెరికా దేశానికి వచ్చాక భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ బుధవారం ట్వీట్ల వర్షం కురిపించారు.‘‘న్యూయార్క్ నగరంలో దిగాను. పలువురు నాయకులతో ఇంటరాక్షన్, జూన్ 21వతేదీన జరిగే యోగా డే ప్రోగ్రామ్‌తో సహా ఇక్కడ జరిగే కార్యక్రమాల కోసం ఎదురు చూస్తున్నాను’’ అని మోదీ ట్వీట్ చేశారు.(PM Modi US Visit 2023) అమెరికా,భారత్ స్నేహబంధం మరింత బలోపేతం అవుతోంది పలు సమస్యలపై నా ఆలోచనలను పంచుకుంటానని మోదీ పేర్కొన్నారు.(PM Modi tweet)
Welcome Modi uncle:వెల్‌కమ్ మోదీ అంకుల్! ఆటోగ్రాఫ్ ఉన్న పోస్టర్‌తో ఆరేళ్ల చిన్నారి స్వాగతం
న్యూఢిల్లీ, వాషింగ్టన్‌ల మధ్య సంబంధాలు గతంలో కంటే దృఢంగా ఉన్నాయని వాల్ స్ట్రీట్ జర్నల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భారత ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.(after reaching America)‘‘అమెరికాలో నేను వ్యాపార ప్రముఖులను కలవడానికి, భారతీయులతో సంభాషించడానికి, వివిధ రంగాలకు చెందిన ఆలోచనాపరులను కలిసే అవకాశాన్ని కూడా పొందుతాను. వాణిజ్యం, ఆవిష్కరణలు, సాంకేతికత వంటి కీలక రంగాల్లో భారతదేశం-యూఎస్ఎ సంబంధాలను మరింతగా పెంచుకోవడానికి మేం ప్రయత్నిస్తున్నాం’’ అని మోదీ మరో ట్వీట్ చేశారు.
PM Modis supporters in New York:అమెరికాలో మోదీ చిత్రంతో జాకెట్ ధరించి స్వాగతం
అమెరికా పర్యటన సందర్భంగా మోదీ పర్యటన ఆసాంతం అత్యంత బిజీగా ఉంది. ప్రధాని మోదీ, భారతీయ అమెరికన్ల సీఈవోలతో సమావేశం కానున్నారు. ఆ తర్వాత బుధవారం ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు.
Shared my thoughts on a wide range of issues including the strong India-USA friendship.@rovingrajesh @gefairclough https://t.co/R1q5o9JFyl
— Narendra Modi (@narendramodi) June 20, 2023