Tittok Bhargav
Tittok Bhargav : 14ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడి గర్భవతిని చేసిన కేసులో టిక్ టాక్ స్టార్, ఫన్ బకెట్ ఫేం భార్గవ్ ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు వివరాలను విశాఖ సిటీ దిశ ఏసీపీ ప్రేమ్ కాజల్ మీడియాకు తెలిపారు. భార్గవ్ నిజస్వరూపాన్ని ఆమె బట్టబయలు చేశారు. చెల్లి అంటూ దగ్గరై టిక్ టాక్ లో పాపులర్ చేస్తానంటూ, ఇతర మీడియా చానల్స్ లో అవకాశం ఇప్పిస్తానంటూ బాలికపై అత్యాచారం చేసి గర్భవతిని చెయ్యడమే కాదు మైనర్‌తో అశ్లీల చిత్రాలు తీసి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడినట్టు కూడా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు నిందితునిపై అత్యాచారంతో పాటు పోక్సో యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసినట్లు ఏసీపీ వివరించారు.
టిక్ టాక్ ద్వారా బాలికను పరిచయం చేసుకున్న భార్గవ్.. టిక్ టాక్ లో స్టార్ చేస్తానని, ఇతర మీడియా చానెల్స్ లో చాన్సులు ఇప్పిస్తానని బాలికకు దగ్గరయ్యాడు. ఈ క్రమంలో ప్రేమిస్తున్నానని ప్రపోజ్ చేశాడు. అయితే ఆ బాలిక నో చెప్పింది. అయినా భార్గవ్ బాలికను వదల్లేదు. వీడియోల పేరుతో దగ్గరయ్యాడు. ఈ క్రమంలో డ్రెస్ చేంజ్ చేసుకున్నప్పుడు తీసిన ఫొటోలు, వీడియోలు తన దగ్గర ఉన్నాయని బాలికను బ్లాక్ మెయిల్ చేసిన భార్గవ్, శారీరకంగా అనుభవించాడని పోలీసులు తెలిపారు. టిక్ టాక్ భార్గవ్ ను మంగళవారం(ఏప్రిల్ 20,2021) ఉదయం హైదరాబాద్ లో అరెస్ట్ చేసి విశాఖపట్నం తీసుకొచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ నిందితుడిపై ఇతర ఫిర్యాదులు ఉంటే బాధితులు పోలీసులను ఆశ్రయించారని ఏసీపీ కాజల్ సూచించారు.
టిక్‌టాక్ వీడియోల పేరుతో మైనర్ బాలికను లోబర్చుకుని, పలుమార్లు అత్యాచారం చేసినట్లు విశాఖ పీస్‌లో భార్గవ్‌పై కేసు నమోదైంది. విజయనగరం జిల్లా కొత్తవలస ప్రాంతానికి చెందిన భార్గవ్ టిక్‌టాక్ వీడియోలతో ఫేమస్ అయ్యాడు. అతనికి విశాఖ జిల్లా సింహగిరి కాలనీకి చెందిన 14 ఏళ్ల బాలికతో చాటింగ్‌లో పరిచయం ఏర్పడింది. ఆ బాలికకు సైతం టిక్‌టాక్ వీడియోలపై ఆసక్తి ఉండటంతో తరుచూ మాట్లాడుకునేవాళ్లు. విశాఖ విజయనగరం సరిహద్దులో ఉన్న సింహగిరి కాలనీ… భార్గవ్ గతంలో నివాసం ఉన్న ప్రాంతానికి దగ్గర కావడంతో వీరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది.
ఈ పరిచయంతో మైనర్ బాలిక భార్గవ్‌ను అన్నయ్య అని పిలిచేది. ఇద్దరూ తరుచూ చాటింగ్ చేయడం, కలుసుకుంటుండంతో సాన్నిహిత్యం పెరిగింది. టిక్‌టాక్ వీడియోల పేరుతో భార్గవ్ ఆమెను లోబర్చుకున్నాడు. ఇటీవలె బాలిక శారీరక అంశాల్లో మార్పు గమనించిన ఆమె తల్లి డాక్టర్‌ను సంప్రదించగా యువతి అప్పటికే నాలుగు నెలల గర్భిణి అని తెలిసి షాక్ తింది.
ఇందుకు కారణం ఫన్ బకెట్ భార్గవ్ అని ఆరోపిస్తూ బాలిక తల్లి ఏప్రిల్ 16న పెందుర్తి పోలీసులను ఆశ్రయించింది. విశాఖ సిటీ దిశ ఏసీపీ ప్రేమ్ కాజల్ ఆధ్వర్యంలో కేసు విచారణ కొనసాగుతోంది. బాలికను చెల్లి పేరుతో లోబర్చుకుని గర్భవతిని చేసినట్లు భార్గవ్ సైతం అంగీకరించినట్లు సమాచారం. ప్రస్తుతం భార్గవ్‌ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.