Niharika Konidela : నాగబాబు కూతురు నిహారిక ఇంట్లో అర్థరాత్రి గొడవ, భర్తపై పోలీసులకు ఫిర్యాదు

గత అర్ధరాత్రి నాగబాబు కూతురు నిహారిక ఇంట్లో పెద్ద గొడవ జరిగింది. నిహారిక భర్త చైతన్య న్యూసెన్స్ చేస్తున్నాడని అపార్ట్‏మెంట్ వాసులు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే నిహారిక భర్త సైతం అపార్ట్‏మెంట్ వాసులపై మరో ఫిర్యాదు చేశారు.

Niharika Konidela

Niharika Konidela : మెగా డాటర్ నిహారిక భర్త జొన్నలగడ్డ చైతన్యపై పోలీసులకు ఫిర్యాదు అందింది. నిహారిక భర్త చైతన్య న్యూసెన్స్ చేస్తున్నాడని అపార్ట్‏మెంట్ వాసులు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత అర్ధరాత్రి నిహారిక ఇంట్లో పెద్ద గొడవ జరిగిందని, కేకలు వినిపించాయని సమాచారం. ఏం జరిగిందోనని అపార్ట్ మెంట్ వాసులు నిహారిక ఇంటికి వెళ్లి చూడగా వారితో నిహారిక భర్త గొడవపడినట్టు తెలుస్తోంది. దీంతో అపార్ట్ మెంటు వాసులు చైతన్యపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే నిహారిక భర్త సైతం అపార్ట్‏మెంట్ వాసులపై మరో ఫిర్యాదు చేశారు. ఇరువురు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. ఫిర్యాదులు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

అర్దరాత్రి అపార్ట్ మెంట్ వాసులకు, నిహారిక భర్త చైతన్య జొన్నలగడ్డకు మధ్య తీవ్ర స్థాయిలో గొడవ జరిగినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో అపార్టు‌మెంటు వాసులు నిహారిక భర్త చైతన్య పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారట. కాగా, నిహారిక భర్త చైతన్యపై పోలీస్ స్టేషన్‏లో కేసు నమోదు కావడం హాట్ టాపిక్ గా మారింది. క్షణాల్లోనే ఈ న్యూస్ వైరల్ అయ్యింది. అంతా దీని గురించే చర్చించుకుంటున్నారు. అసలేం జరిగింది అనే దానిపై ఆరా తీస్తున్నారు.

మెగా డాటర్, నాగబాబు కుమార్తె గుంటూరు రేంజ్ ఐజీ ప్రభాకర్ రావు కొడుకు జొన్నలగడ్డ చైతన్యను పెళ్లాడింది. గతేడాది డిసెంబర్ లో రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌ ప్యాలస్‌లో వీరి వివాహం ఘనంగా జరిగింది. ప్రస్తుతం ఈ జంట హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ఓ అపార్ట్ మెంట్‌లో నివాసం ఉంటోంది.