Women fighting on the road : నడిరోడ్డుపై లేడీస్ బ్యాచ్ ఫైటింగ్.. కంట్రోల్ చేయడానికి ఆ పోలీస్ ఏం చేశాడంటే?

ఏం జరిగిందో ఏమో ? సడెన్‌గా రోడ్డుపై నలుగురు ఆడవాళ్లు తన్నుకోవడం మొదలుపెట్టారు. చుట్టూ ఉన్నవారంతా అయోమయంగా చూస్తున్నారు. అంతలో అక్కడికి వచ్చిన పోలీస్ వారి ఫైటింగ్ సింపుల్‌గా ఆపేసి వెళ్లిపోయాడు. ఇంతకి అతను చేశాడంటే?

Women fighting on the road

Ladies batch fighting on the road : ఏం జరిగిందో ఏమో? రోడ్డు మీద ఓ లేడీ బ్యాచ్ భయంకరమైన యుద్ధానికి దిగింది. సినిమా సన్నివేశాన్ని తలపించిన వారి కోట్లాటని పోలీసు ఎలా కంట్రోల్ చేశారో చూస్తే షాకవుతారు.

Bengaluru : చీరల షాపులో చితక్కొట్టుకున్న మహిళలు .. సిగపట్లతో రాద్ధాంతం

మిస్సౌరిలోని కాన్సాస్ సిటీలోని లైవ్లీ వెస్ట్ పోర్ట్ డిస్ట్రిక్ట్ లో నలుగురు ఆడవారు భయంకరంగా తన్నుకోవడం మొదలుపెట్టారు. ఒకరి జుట్టు ఒకరు పీక్కోడం.. పిడి గుద్దులు గుద్దుకోవడం.. సినిమా స్టంట్ లను మించి జరిగిన తన్నులాటలో సడెన్ ట్విస్ట్ జరిగింది. అక్కడికి వచ్చిన పోలీస్ వారిపై పెప్పర్ స్ప్రే చల్లాడు. అక్కడి నుంచి మరి కాస్త దూరం వెళ్లి అక్కడ తిరిగి కొట్టుకోబోయిన వారిపై మళ్లీ పెప్పర్ స్ట్రే చల్లడంతో అందరూ అక్కడి నుంచి పరుగులు తీశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకయ్యారు.

Peacock fight with women : ఇద్దరు మహిళలు నెమలి గుడ్లు దొంగిలించాలనుకున్నారు.. ఆ నెమలి ఎలా బుద్ధి చెప్పిందంటే?

@CatchUpFeed అనే యూజర్ ద్వారా ట్విట్టర్ లో షేరైన ఈ వీడియో వైరల్ అవుతోంది. కొంతమంది వారి మధ్య జరగుతున్న భీకరమైన యుద్ధం ఆపడానికి పోలీసుకి వచ్చిన ఐడియాకి ప్రశంసలు కురిపించారు. మరికొంతమంది బహిరంగ ప్రదేశాల్లో పెప్పర్ స్ప్రే చల్లడం ఎంతవరకూ సేఫ్ అని ప్రశ్నించారు. చేయి దాటిపోయిన పరిస్థితిని అదుపులో పెట్టేందుకు పోలీసు ఈ నిర్ణయం తీసుకుని ఉంటాడనిపిస్తోంది.

ట్రెండింగ్ వార్తలు