సైకిళ్లపై వెళ్తున్న వలసకూలీలపై లాఠీఛార్జ్

  • Publish Date - May 16, 2020 / 05:42 AM IST

గుంటూరు జిల్లా తాడేపల్లిలో వలస కూలీలపై పోలీసులు లాఠీ చార్జీ చేశారు. తిండిలేక పట్టణంలో బతకలేక ఇంటిదారి పట్టిన వలసకూలీలను రోడ్లపై పరుగులు పెట్టించారు పోలీసులు. అనంతరం వారందరినీ పునరావాస కేంద్రాలకు తరలించారు.

వివరాల్లోకి వెళ్తే.. ఉత్తర్‌ప్రదేశ్‌, ఒడిశా, మధ్యప్రదేశ్‌, ఝార్ఖండ్‌, ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన వెయ్యి మంది వలస కూలీలను తాడేపల్లిలోని విజయవాడ క్లబ్‌కు తరలించారు. వారంతా నడుచుకుంటూ స్వస్థలాలకు పయనం అవగా, అదే సమయంలో అటువైపుగా వెళ్తున్న ఏపీ సీఎస్ నీలం సాహ్ని వారిని చూసి ఆగి వివరాలు తెలుసుకున్నారు. 

అనంతరం వారిని పునరావాస కేంద్రాలకు తరలించాలని, అక్కడి నుంచి స్వస్థలాలకు పంపాలని ఆదేశించారు. సీఎస్ ఆదేశాలతో వలస కూలీలందరినీ అధికారులు తాడేపల్లిలోని విజయవాడ క్లబ్‌కు తరలించగా.. ఉదయం వారందరికీ అల్పాహారం అందజేవారు. ఈ క్రమంలోనే సైకిళ్లపై వచ్చిన దాదాపు 150 మంది కూలీలు టిఫిన్ చేసి తిరుగుముఖం పట్టారు.

వీరంతా విజయవాడ కనకదుర్గమ్మ వారధి వద్దకు చేరుకోగానే పోలీసులు చూసి అడ్డుకుని లాఠీచార్జ్ చేశారు. దీంతో కూలీలు భయంతో రోడ్లపై పరుగులు తీశారు. అనంతరం వారిందరినీ పట్టుకుని తిరిగి విజయవాడ క్లబ్‌కు తరలించారు. 

Read Here>> ప్రకాశం జిల్లాలో ఘోర ప్రమాదం…11మంది కూలీలు మృతి