Punjab Elections: సమరానికి సిద్దమవుతున్న పొలిటికల్ పార్టీలు!

పంజాబ్ లో ఈ ఏడాదే జరగనున్న ఎన్నికల సమరానికి పొలిటికల్ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ఎత్తులు, పై ఎత్తులతో శిరోమణి అకాలీ దళ్ తనదైన పొలిటికల్ వ్యూహాలకు పదును పెడుతూనే.. బీఎస్పీతో పొత్తుకు అకాలీదళ్ సూత్రప్రాయ అంగీకారం తెలిపింది.

Punjab Elections: పంజాబ్ లో ఈ ఏడాదే జరగనున్న ఎన్నికల సమరానికి పొలిటికల్ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ఎత్తులు, పై ఎత్తులతో శిరోమణి అకాలీ దళ్ తనదైన పొలిటికల్ వ్యూహాలకు పదును పెడుతూనే.. బీఎస్పీతో పొత్తుకు అకాలీదళ్ సూత్రప్రాయ అంగీకారం తెలిపింది. ఈ మేరకు త్వరలోనే అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. కేంద్రం తీసుకొచ్చిన అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా గతేడాది నవంబర్ లో అకాలీదళ్ ఎన్డీఏ నుంచి వైదొలగగా.. అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా హర్ సిమ్రత్ కౌర్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం పంజాబ్ లో కెప్టెన్ అమరేందర్ సింగ్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. 2017లో జరిగిన ఎన్నికల్లో శిరోమణి అకాలీదళ్ పార్టీ అధికారాన్ని కోల్పోగా.. 77 సీట్లతో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకుంది. తొలిసారి పోటీలోనే ఢిల్లీ అభివృద్ధి పేరిట ఆమ్ ఆద్మీ పార్టీ 20 సీట్లు సాధించగా.. శిరోమణి అకాలీదళ్ 68 నుంచి 18కి పడిపోయింది. అయితే, ప్రస్తుతం ఎన్డీఏతో తెగతెంపుల నేపథ్యంలో అకాలీ దళ్ ముందుగానే ఎన్నికలపై ఫోకస్ పెట్టగా ఒక్కసారిగా ఎన్నికల హీట్ మొదలైంది.

ట్రెండింగ్ వార్తలు