Pawan Kalyan : ‘కళాపురం’ కోసం పవన్ కళ్యాణ్.. చిన్న సినిమా కోసం వచ్చి నిజంగానే పవర్ స్టార్ అనిపించుకున్నారు..

ఇప్ప‌టికే విడుద‌లైన క‌ళాపురం సినిమా ఫ‌స్ట్ లుక్‌, టీజ‌ర్, పోస్ట‌ర్స్ అన్నీ సినిమాపై ఆస‌క్తిని పెంచాయి. ఇప్పుడీ అంచ‌నాల‌ను మ‌రింత‌గా పెంచేలా మేక‌ర్స్ క‌ళాపు

Pawan Kalyan :  ‘పలాస 1978’, ‘శ్రీదేవి సోడా సెంటర్’ వంటి రా అండ్ ర‌స్టిక్ చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌ట‌మే కాక విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్న డైరెక్టర్ క‌రుణ కుమార్ ఈసారి అందుకు భిన్నంగా కామెడీ డ్రామా కాన్సెప్ట్‌తో తెర‌కెక్కిస్తోన్న చిత్ర‌మే ‘కళాపురం’ ‘ఈ ఊరిలో అందరూ కళాకారులే’ సినిమా క్యాప్షన్. ఆగస్ట్ 26న సినిమా రిలీజ్ అవుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్‌ స‌మ‌ర్ప‌ణ‌లో ఆర్4 ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై ర‌జనీ తాళ్లూరి.. కళాపురం సినిమాను నిర్మిస్తున్నారు. స్టార్ క్యాస్టింగ్ లేకుండానే స‌త్యం రాజేష్‌, చిత్రం శ్రీను, ర‌క్షిత్ అట్లూరి లాంటి ఆర్టిస్టులు ముఖ్యపాత్రల్లో న‌టించారు.

ఇప్ప‌టికే విడుద‌లైన క‌ళాపురం సినిమా ఫ‌స్ట్ లుక్‌, టీజ‌ర్, పోస్ట‌ర్స్ అన్నీ సినిమాపై ఆస‌క్తిని పెంచాయి. ఇప్పుడీ అంచ‌నాల‌ను మ‌రింత‌గా పెంచేలా మేక‌ర్స్ క‌ళాపురం సినిమా ట్రైల‌ర్‌ను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చారు. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ సినిమా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేసి సినిమా మంచి విజ‌యాన్ని సాధించాల‌ని చిత్ర యూనిట్‌ను అభినందించారు. పవన్ కళ్యాణ్ ఇంత చిన్న సినిమా ట్రైలర్ ని విడుదల చేయడం చాలా ఆశ్చర్యంగా అనిపించినా ఇండస్ట్రీలో అందర్నీ ఆయన ఎంకరేజ్ చేస్తారని ఇలా మరోసారి నిరూపించారు. కామెడీ సినిమా కూడా కావడం, పవన్ కళ్యాణ్ నేరుగా ట్రైలర్ లాంచ్ చేయడంతో సినిమాపై పవన్ అభిమానులు ఆసక్తి చూపించడమే కాక సినిమాకి మంచి బజ్ క్రియేట్ అయింది.

Salman Rushdie Attacked : ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీపై దాడి.. న్యూయార్క్‌లో ఘటన

ఇక 1 నిమిషం 57 సెక‌న్ల వ్య‌వ‌ధి ఉన్న ఈ ట్రైల‌ర్‌లో కామెడీ కోణంలో సినిమాని తెరకెక్కించారని తెలుస్తుంది. ఓ దర్శ‌కుడు, నిర్మాత క‌లిసి ఒక సినిమాను చేయాల‌నుకుంటారు. అయితే తాను ఉంటున్న క‌ళాపురం గ్రామంలో కొంత సినిమా షూటింగ్ చేయాల‌నే కండీష‌న్ మీద నిర్మాత సినిమాను స్టార్ట్ చేస్తాడు. అయితే డ‌బ్బు కోసం మ‌ధ్య‌లో పోలీసులు, విల‌న్ ఎంట్రీ ఇస్తారు. అలాంటి ప‌రిస్థితుల్లో ద‌ర్శ‌కుడు, నిర్మాత క‌లిసి సినిమాను ఎలా పూర్తి చేశార‌నేదే సినిమా. స‌త్యం రాజేష్ ఇందులో డైరెక్ట‌ర్ పాత్ర‌ను పోషించారు. ఇన్ని రోజులు హార్డ్ సినిమాలు తీసిన కరుణ కుమార్ ఈ సారి ఓ లైట్, కామెడీ మూవీతో రాబోతున్నాడు.

ట్రెండింగ్ వార్తలు