Prabhas: మిర్చి కాంబో రిపీట్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ ‘రాధేశ్యామ్’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ మూవీగా నిలిచింది. ఈ సినిమాను దర్శకుడు రాధాకృష్ణ కుమార్ పూర్తి రొమాంటిక్....

Prabhas

Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ ‘రాధేశ్యామ్’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ మూవీగా నిలిచింది. ఈ సినిమాను దర్శకుడు రాధాకృష్ణ కుమార్ పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించాడు. అయితే ఈ సినిమాలో మాస్ అంశాలు ఏమీ లేకపోవడంతో ఈ సినిమాకు ప్రేక్షకుల ఆదరణ కరువయ్యింది. తొలిరోజే నెగెటివ్ టాక్ రావడంతో ఈ సినిమాను చూసేందుకు ఆడియెన్స్ పెద్దగా ఆసక్తిని చూపలేదు. ఇక రాధేశ్యామ్ ఫెయిల్యూర్ నుండి బయటికొచ్చిన ప్రభాస్, ప్రస్తుతం తన నెక్ట్స్ ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టే పనిలో ఉన్నాడు.

Radhe Shyam: నష్టాలపాలైన బయ్యర్లు.. రాధేశ్యామ్ ఫైనల్ కలెక్షన్స్ రిపోర్ట్ ఇదే!

ఈ క్రమంలో ఇప్పటికే ఆదిపురుష్ చిత్రాన్ని రిలీజ్‌కు రెడీ చేస్తున్న ప్రభాస్, కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో సలార్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమాతో పాటు నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో ప్రాజెక్ట్ K అనే సినిమాను కూడా స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు ప్రభాస్. కాగా ఈ సినిమాలతో పాటు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ చిత్రంలో కూడా నటించేందుకు రెడీ అయ్యాడు. అయితే ఈ సినిమాలతో పాటు దర్శకుడు మారుతి డైరెక్షన్‌లో ఓ సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు. ఇలా వరుసగా సినిమాలను క్యూలో పెడుతున్న ప్రభాస్, మరోసారి తనకు మిర్చి లాంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన దర్శకుడు కొరటాల శివతో కూడా ఓ సినిమా చేయాలని చూస్తున్నాడట.

Prabhas: రెబల్ స్టార్‌తో మారుతి.. పట్టాలెక్కుతుందా?.. ఆగిపోతుందా?

ఇటీవల ప్రభాస్‌ను కలిసిన కొరటాల ఓ అదిరిపోయే స్టోరీలైన్‌ను వినిపించాడట. ఈ లైన్ నచ్చిన ప్రభాస్ వెంటనే కొరటాలతో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. అయితే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కాలంటే 2025 వరకు కొరటాల వెయిట్ చేయాల్సిందే. ప్రభాస్ తాను కమిట్ అయిన అన్ని ప్రాజెక్టులను పూర్తి చేశాకే కొరటాలతో సినిమా చేసే అవకాశం ఉందని.. మరి ఈ ప్రాజెక్ట్ కోసం కొరటాల ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేయగలడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. కాగా కొరటాల ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య చిత్రాన్ని రిలీజ్ కు రెడీ చేయగా, తన నెక్ట్స్ మూవీని యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో చేసేందుకు రెడీ అవుతున్నాడు. మరి కొరటాల, ప్రభాస్‌ల కాంబో మరోసారి సెట్ అవుతుందో లేదో తెలియాలంటే మరికొంత కాలం వెయిట్ చేయాల్సిందే.