Prasanth Varma Next Movie Titled Adhira
Prasanth Varma: టాలీవుడ్‌లో తనదైన మార్క్ చిత్రాలను తెరకెక్కిస్తూ మంచి విజయాలను అందుకున్న యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తాజాగా మరో చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు. ఇప్పటికే తేజ సజ్జా హీరోగా ‘హనుమాన్’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు ఈ డైరెక్టర్. కాగా తాజాగా ఆయన కళ్యాణ్ దాసరి అనే కొత్త హీరోతో చేయబోయే సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్‌తో పాటు ఫస్ట్‌లుక్ పోస్టర్, ఫస్ట్ స్ట్రైక్ వీడియోను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.
Hanu-Man : ‘అంజనాద్రి’ ప్రపంచంలోకి తీసుకెళ్తున్న ‘హనుమంతు’
‘అధీరా’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమా ఓ సూపర్ హీరో మూవీగా దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించనున్నాడు. ఈ సినిమాలో హీరోకు సూపర్ పవర్స్ ఉంటాయని, వాటితో అతడు సమాజంలోని చెడును ఎలా ఎదుర్కొంటాడనేది సినిమా కథగా మనకు చూపించబోతున్నట్లు ఈ ఫస్ట్ స్ట్రైక్ వీడియో చూస్తే అర్థమవుతోంది. ఇక డివివి దానయ్య కొడుకు కళ్యాణ్ దాసరి ఈ సినిమాతో టాలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.
కాగా ఈ సినిమా ఫస్ట్ స్ట్రైక్‌ను ఆర్ఆర్ఆర్ ట్రయో అయిన రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు కలిసి రిలీజ్ చేశారు. ఈ సినిమాను ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుండి తీసుకొస్తుండటంతో ఈ సినిమా కథ, స్క్రీన్‌ప్లే మిగతా సినిమాలకంటే విభిన్నంగా ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ అంటోంది. ఇక ఈ సినిమాను ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె.నిరంజన్ రెడ్డి ప్రొడ్యూస్ చేస్తున్నారు. కాగా ఈ సినిమాకు గౌరహరి సంగీతం అందిస్తున్నారు.
Hanu Man : ఒరిజినల్ ఇండియన్ సూపర్ హీరో ఫిల్మ్ ‘హను–మాన్’
అధీరా అనే సూపర్ హీరో ప్రేక్షకులను ఎంతమేర మెప్పిస్తాడో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే. ఇక ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న హనుమాన్ చిత్రం కూడా సూపర్ హీరో కాన్సెప్ట్‌తో వస్తుండగా, ఈ సినిమాను కూడా పాన్ ఇండియా మూవీగా రూపొందిస్తున్నాడు ఈ డైరెక్టర్. ఇలా వరుసగా సూపర్ హీరోల కథలతో వస్తున్న ప్రశాంత్ వర్మ ఈ సినిమాలతో ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో చూడాలి.