Prashant Kishor on Bihar crisis: నితీష్ నిర్ణయం జాతీయ రాజకీయాలపై పెద్దగా ప్రభావం చూపదు..

బీహార్ సీఎం, జేడీ(యూ) అధినేత నితీష్ కుమార్ ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చిన విషయం విధితమే. బీజేపీతో తెగదెంపులు చేసుకొని బీహార్ లోని ప్రధాన ప్రతిపక్షమైన ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలతో కలిసి కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు.

Prashant Kishor on Bihar crisis: బీహార్ సీఎం, జేడీ(యూ) అధినేత నితీష్ కుమార్ ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చిన విషయం విధితమే. బీజేపీతో తెగదెంపులు చేసుకొని బీహార్ లోని ప్రధాన ప్రతిపక్షమైన ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలతో కలిసి కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు. నేడు సీఎంగా మరోసారి నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుస్తోంది. ఇదిలాఉంటే బీహార్ రాష్ట్రంలో జరుగుతున్న పొలిటికల్ రగడపై రాజకీయ వ్యూహకర్త, జేడీ(యు) మాజీ నేత ప్రశాంత్ కిషోర్ స్పందించారు. బీహార్ లో నితీష్ కుమార్ ఎత్తుగడ ప్రధాని రేసును లక్ష్యంగా చేసుకున్నట్లు తాను అనుకోవటం లేదని, ఈ నిర్ణయం రాష్ట్రంలోని రాజకీయం, పాలనకు సంబంధించినది అని ప్రశాంత్ కిషోర్ అన్నారు. ఎన్డీయే కూటమి నుంచి వైదొలగాలని నితీష్ కుమార్ తీసుకున్న నిర్ణయం వెనుక ఏదైనా జాతీయ లక్ష్యం ఉందని నేను అనుకోవటం లేదని తెలిపారు.

Bihar Deputy CM బిహార్ డిప్యూటీ సీఎంగా తేజస్వి యాదవ్.. ఆర్‌జేడీకి జాక్‌పాట్!
బీహార్ గత 10 సంవత్సరాలుగా రాజకీయ అస్థిరతకు కేంద్రంగా ఉందని, ఈ అస్థిరత మధ్య ముఖ్యమంత్రిగా కొనసాగిన నితీష్ కుమార్ పరిస్థితికి ప్రధాన కారకుడని అన్నారు. కొత్త పరిణామాలు కూడా అదే దిశలో ఉన్నాయని, బీహారీగా నితీష్ కుమార్ ఇప్పుడు నిర్మించుకున్న కూటమిపై గట్టిగా నిలబడతారని మాత్రమే తాను ఆశించగలనని ప్రశాంత్ కిషోర్ అన్నారు.

Bihar Politics : కమలానికి దూరమవుతున్న మిత్రపక్షాలు..బీజేపీకి నితీష్ బ్రేకప్‌ స్టోరీస్‌ వెనక భారీ వ్యూహం ఉందా..?

2013-14 నుండి బీహార్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఇది 6వ ప్రయత్నం అని, ఒకరి రాజకీయ, పరిపాలనా అంచనాలు నెరవేరనప్పుడు రాజకీయాలు మారుతాయని ప్రశాంత్ కిషోర్ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతు తెలిపారు. కొత్తగా కొలువుదీరనున్న ప్రభుత్వాన్ని నడపడంలో బహుశా అతను ప్రధాన పాత్ర పోషిస్తాడని, ఈ కొత్త ప్రభుత్వంలో ఆయన ఎలా పనిచేస్తారో ప్రజలు చూస్తారంటూ ప్రశాంత్ కిషోర్ అన్నారు.

ట్రెండింగ్ వార్తలు