NTR: తారక్‌పై ప్రశాంత్ నీల్ వైరల్ కామెంట్స్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ టాలీవుడ్‌లో ఉన్న మేటి యాక్టర్స్‌లో టాప్ లిస్ట్‌లో ఉంటాడనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన నటన, డ్యాన్స్.. ఇలా అన్నింటిలోనూ తనదైన మార్క్.....

Prashant Neel Comments On Ntr Goes Viral

NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ టాలీవుడ్‌లో ఉన్న మేటి యాక్టర్స్‌లో టాప్ లిస్ట్‌లో ఉంటాడనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన నటన, డ్యాన్స్.. ఇలా అన్నింటిలోనూ తనదైన మార్క్ వేసుకుని తనకంటూ అశేష అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఇక మాస్‌లో తారక్‌కు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. కాగా తాజాగా తారక్ గురించి కేజీఎఫ్ చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా  మారాయి.

NTR : ఎన్టీఆర్ పెట్టుకున్న వాచ్ ఖరీదు ఎంతో తెలుసా.. ఆ కాస్ట్ తో ఒక చిన్న సినిమా తీసేయొచ్చు

ప్రస్తుతం కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ప్రెస్టీజియస్ పాన్ ఇండియా మూవీ ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ చిత్ర ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా ఉన్నాడు ఈ డైరెక్టర్. కాగా ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా యంగ్ టైగర్ తారక్ గురించి ప్రశాంత్ నీల్ కొన్ని కామెంట్స్ చేశారు. తాను తారక్‌కు దాదాపుగా 20 ఏళ్ల నుండి వీరాభిమానినని చెప్పుకొచ్చిన ప్రశాంత్ నీల్, ఇప్పటివరకు ఆయన్ను 10, 15 సార్లు కలిసినట్లు చెప్పుకొచ్చారు. అయితే ఆయన తారక్ కోసం ఓ పవర్‌ఫుల్ కథను రెడీ చేశానని, ఇప్పటికే తారక్‌కు అది వినిపించగా, ఆయన గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాడని చెప్పుకొచ్చాడు. అయితే అది ఏ జోనర్ కథ అనేది తానిప్పుడే చెప్పలేనని ప్రశాంత్ నీల్ అన్నారు.

Prashant Neel: ప్రశాంత్ నీల్ సినిమాలకు భారీ ఢీల్!

ఇక ప్రస్తుతం తారక్, తాను మంచి సన్నిహితులుగా మారామని.. ఆయనతో సినిమా చేసేందుకు తాను ఎంతో ఉత్సాహంగా ఉన్నానంటూ ప్రశాంత్ నీల్ చెప్పుకొచ్చాడు. ఇక తారక్ పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ చూస్తే ఆయన ఓ ఆటం బాంబ్‌లా కనిపిస్తారని ప్రశాంత్ నీల్ అన్నారు. అయితే ప్రశాంత్ నీల్ ప్రస్తుతం కేజీఎఫ్ 2 చిత్రాన్ని రిలీజ్‌కు రెడీ చేయగా, ఈ సినిమా తరువాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో కలిసి సలార్ అనే సినిమాను తెరకెకక్కించేందుకు రెడీ అయ్యాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పూర్తయ్యాకే తారక్‌తో తన సినిమా ఉంటుందని ప్రశాంత్ నీల్ చెప్పుకొచ్చాడు.