Pre Marital Counseling Certificate Compulsory
pre marital counseling certificate compulsory : వివాహానికి ముందు వధూ వరులకు కైన్సెలింగ్ ను తప్పనిసరి అని కేరళ మహిళా కమిషన్ స్పష్టం చేసింది. గృహ హింస, వరకట్న వేధింపులు, వివాహితులపై దాడులను అరికట్టేందుకు కేరళ మహిళా కమిషన్ ఈ సరికొత్త నిర్ణయం తీసుకుంది. వివాహం తరువాత అధికారిక గుర్తింపు పొందాలంటే కూడా వివాహానికి ముందు వధూవరులు ఇకపై తప్పనిసరిగా ప్రి వెడ్డింగ్ కౌన్సెలింగ్ తప్పనిసరి అని మహిళా కమిషన్ తేల్చి చెప్పింది. తప్పకుండా వధువరులిద్దరు కౌన్సెలింగ్ కు హాజరుకావాలని సూచించింది. అంతేకాదు వివాహ రిజిస్ట్రేషన్ సమయంలో ఈ కౌన్సెలింగ్‌కు హాజరైనట్లు సంబంధిత ధ్రువ పత్రం సమర్పిస్తేనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముందుకు సాగుతుందని స్పష్టం చేసింది.
Read more : HC Redefines Rape : అత్యాచారానికి కొత్త నిర్వచనం చెప్పిన కేరళ హైకోర్టు..
గృహహింస, వరకట్న వేధింపులు అరికట్టటానికే ఈ కౌన్సెలింగ్..
కేరళ రాష్ట్రవ్యాప్తంగా మహిళలపై హింస పెరుగుతోంది. గృహహింస, వరకట్న వేధింపులు కేసులు ఎక్కువ సంఖ్యలో నమోదవుతున్నాయి. ఈ వేధింపులు, హింసలు భరించలేక చాలామంది యువతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా ఉత్రా కేసు( పాముతో భార్యను చంపించిన దారుణ సంఘటన), విస్మయ అనే మెడికల్ స్టూడెంట్ వరకట్న వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న ఘటనలు దేశంలో సంచలనం సృష్టించాయి.ఇటువంటి ఘటనలు జరగకూడదనే ఉద్ధేశంతో ప్రి వెడ్డింగ్ కౌన్సెలింగ్ ను అమల్లోకి తీసుకొచ్చామని కేరళ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ సతీదేవి వెల్లడించారు.
దాంపత్య బంధంలో ఉండే సాధక బాధకాలను ఈ కౌన్సెలింగ్‌లో వధూవరులకు వివరిస్తామని..వివాహం తరువాత వచ్చే ఇబ్బందల్ని ఎలా పరిష్కరించుకోవచ్చు? ఒకరినొకరు అర్థం చేసుకుని సమస్యల్ని ఎలా చక్కబెట్టుకోవచ్చు?అవగాహనాలోపంతోను..ఇగోలతో వచ్చే అభిప్రాయబేధాల్ని ఎలా పరిష్కరించుకోవచ్చు? వంటి పలు విషయాలపై ఈ ప్రి వెడ్డింగ్ కౌన్సెలింగ్ లో వారికి వివరిస్తామని తెలిపారు.అలాగే మహిళలపై హింస, లైంగిక విద్య (సెక్స్ ఎడ్యుకేషన్) వంటి విషయాలను కూడా వివరిస్తామని తెలిపారు.
Read more : కరోనాతో ఎలా పోరాడాలి? కేరళ వైద్యవిధానం నుంచి ప్రపంచం ఏం నేర్చుకొంటోందంటే!