Pregnant Woman Raped: గర్భిణీపై దారుణం.. ఆమె పిల్లల ముందే బంధించి అత్యాచారం!

నిర్భయ, దిశ లాంటి చట్టాలు ఎన్ని ఉన్నా కుళ్లిపోయిన మృగాళ్ల మెదళ్లలో కాస్తంత సంస్కారం అనేది రానంత కాలం ఈ దారుణాలకు అడ్డుకట్ట పడేలా కనిపించడం లేదు. వృద్ధురాలి నుండి అభంశుభం తెలియని చిన్నారుల వరకు కామాంధుల చేతిలో బలైపోతుండగా..

Pregnant Woman Raped The Thugs Who Raped Her In Front Of Her Children

Pregnant Woman Raped: నిర్భయ, దిశ లాంటి చట్టాలు ఎన్ని ఉన్నా కుళ్లిపోయిన మృగాళ్ల మెదళ్లలో కాస్తంత సంస్కారం అనేది రానంత కాలం ఈ దారుణాలకు అడ్డుకట్ట పడేలా కనిపించడం లేదు. వృద్ధురాలి నుండి అభంశుభం తెలియని చిన్నారుల వరకు కామాంధుల చేతిలో బలైపోతుండగా కోర్టులు ఎన్ని శిక్షలు వేసినా.. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చినా అవేమీ మహిళలపై దారుణాలను ఆపలేకపోతున్నాయి. మధ్యప్రదేశ్ ఛతర్​పుర్​ జిల్లాలోని బందర్​ఘఢ్​ లో దారుణాతి దారుణమైన ఘటన జరిగింది.

కనీసం గర్భిణీ అనే కనికరం కూడా లేని మృగాలు ఆమె పిల్లల ముందే అత్యాచారానికి పాల్పడ్డారు. ఆపై జరిగిన దారుణాన్ని ఎవరికైనా చెప్తుందనే భయంతో అత్యాచారం అనంతరం ఆమెను ఆహరం, నీళ్లు ఇవ్వడకుండా ఓ గదిలోనే బంధించి మరింత క్రూరంగా ప్రవర్తించారు. అసలు వివరాలలోకి వెళ్తే.. ఛతర్​పుర్ జిల్లా బందర్​ఘఢ్​కు చెందిన దబంగ్ పటేల్ అనే వ్యక్తికి చెందిన వ్యవసాయ క్షేత్రంలో బైజనాథ్ అహిర్వార్ అనే వ్యక్తి పనిచేసేవాడు. కాగా అనారోగ్య కారణాల వల్ల బైజనాథ్ ఒక రోజు పనికి వెళ్లలేదు.

దీంతో కోపోద్రికుడైన దబంగ్.. బైజనాథ్​తో పాటు అడ్డొచ్చిన అతని సోదరుడు లఖన్ అహిర్వార్​పై దాడి చేశాడు. భయంతో ఆ అన్నదమ్ములిద్దరూ ఊరు వదిలి పారిపోయారు. కానీ వారు ఎక్కడో ఉన్నారో తెలుసుకొనేందుకు దబంగ్ పటేల్.. బైజనాథ్ ఇంటికి తన అనుచరులను పంపించాడు. అయితే వచ్చిన దుండగులు బైజనాథ్ భార్యపై అత్యాచారానికి పాల్పడ్డారు. బైజనాథ్ భార్య అప్పటికే ఐదు నెలల గర్భిణీ కాగా అయినా పట్టించుకోని రాక్షసులు తన పిల్లల ముందే అత్యాచారం చేశారు.

ఆపై బాధితురాల్ని తీవ్రంగా గాయపరిచి ఇంట్లోనే బంధించారు. అలా దాదాపు నాలుగు రోజులు పాటు ఆమెకు తిండి, నీళ్లు ఇవ్వకుండా చంపేస్తామని బెదిరింపులకు దిగారు. అయితే.. చివరికి అక్కడ నుండి తప్పించుకున్న బైజనాథ్ భార్య ఆ షాక్ నుండి తేరుకొని కొద్ది రోజుల తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ప్రస్తుతం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లుగా పోలీసులు చెప్తున్నారు.