Presidential Elections: 27న నామినేష‌న్ వేయ‌నున్న య‌శ్వంత్ సిన్హా.. ఎన్డీఏ అభ్య‌ర్థి 25న‌?

విపక్ష పార్టీల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా ఈ నెల 27న ఉద‌యం 11.30 గంట‌ల‌కు నామినేష‌న్ వేయ‌నున్నారని నేష‌న‌లిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ‌ర‌ద్ ప‌వార్ తెలిపారు.

Presidential Elections: విపక్ష పార్టీల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా ఈ నెల 27న ఉద‌యం 11.30 గంట‌ల‌కు నామినేష‌న్ వేయ‌నున్నారని నేష‌న‌లిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ‌ర‌ద్ ప‌వార్ తెలిపారు. రాష్ట్రప‌తి ఎన్నిక జూలై 18న జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అభ్య‌ర్థి ద్రౌప‌ది ముర్ము ఈ నెల 25న నామినేష‌న్ వేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. నామినేష‌న్ల స్వీక‌ర‌ణ‌కు ఈ నెల‌ 29 చివ‌రి తేదీ. ఎన్నిక ఫ‌లితాలను జూలై 21న వెల్ల‌డిస్తారు.

Presidential election: రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా..? టీఎంసీకి రాజీనామా

కాగా, య‌శ్వంత్ సిన్హాను రాష్ట్రప‌తి అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించడాన్ని తాము గౌర‌వ‌ప్ర‌దంగా భావిస్తున్నామ‌ని టీఎంసీ నేత‌ అభిషేక్ బెన‌ర్జీ చెప్పారు. ఆయ‌న త‌మ పార్టీలో చాలా కాలంగా కొన‌సాగుతున్నాయ‌ర‌ని అన్నారు. విప‌క్ష పార్టీలు అన్ని విభేదాల‌ను ప‌క్క‌న పెట్టాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఆయ‌న చెప్పారు. కాగా, జూలై 24న రాష్ట్రపతిగా రామ్ నాథ్ కోవింద్ పదవీ కాలం ముగియనుండగా, జూలై 25న కొత్త రాష్ట్రపతి పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు.

ట్రెండింగ్ వార్తలు