Priya Prakash Varrier: రెయిన్ సాంగ్‌పై మనసుపడ్డ కన్నుగీటు భామ
ఓ చిన్న కన్నుగీటుతో రాత్రికి రాత్రే దేశంలో ఓ సెన్సేషన్ సుందరిగా మారిపోయిన ముద్దుగుమ్మ ప్రియా ప్రకాష్ వారియర్. తొలి సినిమా ‘ఒరు ఆధార్ లవ్’తో అది కూడా సినిమా విడుదలకు ముందే..
- Naresh Mannam
- Published On : September 27, 2021 / 09:23 AM IST
Priya Prakash Varrier
Priya Prakash Varrier: ఓ చిన్న కన్నుగీటుతో రాత్రికి రాత్రే దేశంలో ఓ సెన్సేషన్ సుందరిగా మారిపోయిన ముద్దుగుమ్మ ప్రియా ప్రకాష్ వారియర్. తొలి సినిమా ‘ఒరు ఆధార్ లవ్’తో అది కూడా సినిమా విడుదలకు ముందే ఒకే ఒక్క సీన్‌తో స్టార్ కథానాయికలను సైతం తలదన్నేసి మిలియన్ల కొద్దీ ఫాలోవర్లను దక్కించుకున్న ప్రియా ప్రకాష్ కు ఆ తర్వాత అనుకున్న స్థాయిలో ఆఫర్లు దక్కలేదు.
Big Boss 5: దేవతలా ఉన్నావన్న నాగ్.. కొత్తగా చెప్పమని పంచ్ ఇచ్చిన బ్యూటీ!
సోషల్ మీడియా నుండి వెండితెరఫై స్టార్ స్టేటస్ కోసం ఎంతగానో తపన పడుతున్న ఈ కేరళ కుట్టి వరుస సినిమాలు చేస్తున్నా హీరోయిన్ గా మాత్రం పాస్ మార్కులు వేసుకోలేకపోతుంది. ఈ అమ్మడు ప్రస్తుతం తెలుగులో ఓ సినిమాతో పాటు హిందీలో ఒక సినిమా చేస్తుండగా సోషల్ మీడియాలో మాత్రం హాట్ హాట్ పిక్స్ షేర్ చేస్తూ నెటిజన్లను.. ఫాలోయర్స్ ను అలరిస్తూ వస్తుంది.
Big Boss 5: లహరి ఎలిమినేషన్.. కారణాలివేనా?
కెరీర్ లో ఎదగాలని చూస్తున్న ఈ భామ తాజాగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. వర్షంలో డాన్స్ చేయడం అంటే తనకి ఎంతో ఇష్టమనీ.. ఇప్పటికీ బాత్ రూంలో షెవర్ కింద వర్షంగా భావించి డాన్స్ చేస్తున్నానని చెప్పింది. అంతేకాదు వర్షంలో షూటింగ్ అది కూడా మంచి రెయిన్ సాంగ్ అవకాశం వస్తే ఖచ్చితంగా ఒప్పుకుంటానని చెప్పింది. నేను ఒక సినీ ప్రేమికురాలిని కనుక నన్ను నేను రెయిన్ సాంగ్ లో చూసుకోవాలని కోరుకుంటున్నా అంది. మరి మన ఫిల్మ్ మేకర్స్ అమ్మడి ఇంట్రెస్ట్ మీద దృష్టి పెడితే మరో మాంచి రెయిన్ సాంగ్ సిద్దమవుతుందేమో.
