Jee Le Zaraa
Jee Le Zaraa: యూనివర్సల్ స్టార్ గా మారిన ప్రియాంకా ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటి వరకు హీరోల మల్టీస్టారర్లు చూశాం. ముగ్గురు స్టార్ హీరోలను కలిపే మల్టీస్టారర్ సినిమాలు చాలా తక్కువగా వస్తుంటాయి. అదే ముగ్గురు స్టార్ హీరోయిన్స్ తో లేడీ ఓరియెంటెడ్ మల్టీస్టారర్ సినిమా చేసే ఎలా ఉంటుంది. అదే ఇప్పుడు బాలీవుడ్ లో సిద్ధం కానున్న జీలే జరా.
జీలే జరా సినిమాకు కారణం కూడా ప్రియాంక చోప్రానే అట. 2019 నవంబరులో ముంబైలో వర్షం కురిసిన ఓ రాత్రి ప్రియాంకా మైండ్ లో మొదలైన ఆలోచనతో ఈ సినిమాకు బీజం పడిందట. హిందీలో ఫీమేల్ మల్టీస్టారర్ సినిమాలు తక్కువగా వస్తున్నాయనే కత్రినా, అలియాలకు ఫోన్ చేసిన ప్రియాంకా ఇలా ఒక ప్రాజెక్ట్ చేయాలని డిసైడ్ అయిందట. మొత్తానికి ఇప్పుడు ఇలా ఓ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది.
రోడ్ ట్రిప్ నేపథ్యంలో సాగే ఈ సినిమాను ఫర్హాన్ అక్తర్ డైరెక్ట్ చేయనుండగా.. 2011లో వచ్చిన ‘డాన్ 2’ తర్వాత ఫర్హాన్ డైరెక్ట్ చేస్తున్న హిందీ సినిమా ఇదే. వచ్చే ఏడాది షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమా ఇప్పుడు బీటౌన్ లో భారీ అటెన్షన్ క్రియేట్ చేసింది. ప్రియాంకా హాలీవుడ్ లో రెండు సినిమాలతో పాటు బాలీవుడ్ లో పింకీ మేడం సినిమాలను చేస్తుండగా కత్రినా ఫోన్ బూత్, టైగర్ 3 సినిమాలతో వస్తుంటే.. అలియా బ్రహ్మాస్త్ర, డార్లింగ్స్ సినిమాలతో పాటు ఇండియన్ క్రేజీ ప్రాజెక్ట్ ఆర్ఆర్ఆర్ సినిమాలతో వస్తుంది.