మూడు రోజుల్లో నాలుగు మరణాలు.. షాక్‌లో బాలీవుడ్..

ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కుల్మీత్ మక్కర్ గుండెపోటుతో కన్నుమూశారు..

  • Publish Date - May 1, 2020 / 11:46 AM IST

ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కుల్మీత్ మక్కర్ గుండెపోటుతో కన్నుమూశారు..

బాలీవుడ్‌ పరిశ్రమలో రెండు రోజుల్లో మూడు మరణాలు సంభవించడంతో అందరూ షాక్‌కి గురయ్యారు. ఇర్ఫాన్ ఖాన్, రిషి కపూర్ వంటి లెజెండరీ యాక్టర్స్ 24 గంటల వ్యవధిలో కన్నుమూసిన సంగతి తెలిసిందే. అయితే ఇర్ఫాన్ చనిపోయిన రోజు (ఏప్రిల్ 29, బుధవారం రాత్రి) పాపులర్ యంగ్ సింగర్‌, నటుడు అర్జున్‌ కనుంగో తండ్రి కూడా మరణించిన సంగతి ఆలస్యంగా వెలుగు చూసింది. ఇప్పుడు మరో ప్రముఖ వ్యక్తి మరణించడంతో హిందీ చిత్రసీమ దిగ్భ్రాంతికి లోనైంది. తాజాగా బాలీవుడ్ ప్రముఖ నిర్మాత, ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా CEO కుల్మీత్ మక్కర్ (60) గుండెపోటుతో శుక్రవారం కన్నుమూశారు.


ఆయన హిమాచల్ ప్రదేశ్ ధర్మశాలలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కుల్మీత్ మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. దాదాపు మూడు దశాబ్దాలుగా సినీపరిశ్రమలో ఉంటున్నారు కుల్మీత్. పలు పెద్ద సంస్థలకు అధిపతిగా ఉండటమే కాకుండా, లాక్‌డౌన్ కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న చిత్ర పరిశ్రమలోని రోజువారీ కూలీల కోసం ట్రస్ట్ ఫండ్‌ను రూపొందించడంలో కూడా కీలకపాత్ర పోషించారు. కరోనా వైరస్ సంక్షోభంలో మక్కర్ రూ .10 లక్షల విరాళం ప్రకటించి ఉదారత చాటుకున్నారు కుల్మీత్.

Also Read | లైవ్‌లో రెచ్చగొట్టేసింది బాసూ..