యువతి ఫొటోలను నగ్నంగా మార్ఫింగ్ చేసి ప్రొఫెసర్ వేధింపులు

అతడు ఓ ప్రొఫెసర్. పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉంటున్నాడు. గురువు అంటే దైవంతో సమానం.

  • Publish Date - May 18, 2020 / 12:20 PM IST

అతడు ఓ ప్రొఫెసర్. పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉంటున్నాడు. గురువు అంటే దైవంతో సమానం.

అతడు ఓ ప్రొఫెసర్. పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉంటున్నాడు. గురువు అంటే దైవంతో సమానం. విద్యార్థులకు క్లాస్ పాఠాలు చెపాల్సిన ఆ ప్రొఫెసర్ కీచకుడయ్యాడు. ప్రేమ పేరుతో కాలేజీలో చదువుతున్న యువతి వెంటపడ్డాడు. ఆమె కాదనేసరికి వేధించడం స్టార్ట్ చేశాడు. అసభ్యకర మేసేజ్ లు పంపాడు. యవతి ఫొటోలను నగ్నంగా మార్ఫింగ్ చేశాడు. వాటిని కుటుంబసభ్యులకు పంపుతానని బెదిరించాడు. చివరకు యువతి పోలీసులను ఆశ్రయించడంతో ఆ కీచక ప్రొఫెసర్ కటకటాల్లోకి వెళ్లాడు. హైదరాబాద్ నగరంలో ఈ ఘటన జరిగింది. ఎంటెక్‌ విద్యార్థిని వేధిస్తున్న అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ను రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్‌ చేశారు.

కొన్ని రోజులు ఫోన్లు, చాటింగ్ లు.. తర్వాత వేధింపులు:
కరీంనగర్‌ అచ్చంపల్లి ప్రాంతానికి చెందిన కోలా హరీష్‌ ఉప్పల్‌ విజయపురి కాలనీలో నివాసం ఉంటున్నాడు. అతడు ఘట్ కేసర్ లోని ఓ కాలేజీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాడు. అదే కాలేజీలో చదువుకుంటున్న ఓ విద్యార్థినితో పరిచయం పెంచుకున్నాడు. ఆమెతో సన్నిహితంగా మెలిగేవాడు. కొద్ది రోజులు ఫోన్లు, చాటింగ్‌లు చేసుకున్నారు. తర్వాత తనను ప్రేమించాలని వెంటపడ్డాడు.

మార్ఫింగ్ ఫొటోలతో బ్లాక్ మెయిల్:
అయితే ఆ యువతి ప్రేమకు నో చెప్పింది. హరీష్ ను దూరం పెట్టింది. పలుమార్లు ఫోన్‌ చేసినా, మెసేజ్‌ చేసినా స్పందించ లేదు. తనను దూరం పెడుతుందని భావించిన హరీష్ యువతిపై కక్ష పెంచుకున్నాడు. వేధింపులు స్టార్ట్ చేశాడు. అసభ్యకరంగా ఉన్న ఫొటోలను ఆమెకు, ఆమె కుటుంబసభ్యులకు వాట్సాప్‌లో పంపాడు. తనతో స్నేహంగా ఉండాలని లేకపోతే ఫొటోలు సోషల్‌ మీడియాలో పెడతానని బెదిరించాడు. కీచక ప్రొఫెసర్ వేధింపులతో విసిగిపోయిన బాధితురాలు రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. రంగంలోకి దిగిన పోలీసులు సాంకేతిక ఆధారాల ద్వారా హరీ‌ష్‌ను అరెస్ట్‌ చేసి రిమాండ్ కు తరలించారు. పవిత్రమైన వృత్తిలో ఉంటూ ఇలాంటి నీచపు పనికి పాల్పడిన ప్రొఫెసర్ ను కఠినంగా శిక్షించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.

Read: సహోద్యోగి భార్యతో సంబంధం….బెడ్ రూంలో దొరికిపోవటంతో..

ట్రెండింగ్ వార్తలు