PUBG Mobile 2.3 Update _ Football edition rolls out in collaboration with Messi
PUBG Mobile 2.3 Update : అత్యంత పాపులర్ వీడియో గేమ్ యాప్ పబ్‌జీ మొబైల్ (PUBG Mobile) వెర్షన్ నుంచి కొత్త అప్‌డేట్ వచ్చేసింది.. అదే.. PUBG మొబైల్ 2.3 అప్‌డేట్. ఈ కొత్త అప్‌డేట్ ఫుట్‌బాల్ నేపథ్య గేమ్‌ప్లేతో లాంచ్ అయింది. ఈ మేరకు కంపెనీ క్రాఫ్టన్ ప్రకటించింది. ఈ కొత్త అప్‌డేట్‌తో.. ఆటగాళ్ళు ఫుట్‌బాల్ మానియా థీమ్‌ను పొందవచ్చు.
ఇందులో వస్తువులు, వాహనాలు, క్రీడల చుట్టూ కేంద్రీకృతమైన గేమ్‌ప్లే ఉంటాయి. మొబైల్ గేమ్ కోసం FIFA వరల్డ్ కప్ 2022కి ముందు ప్రముఖ బ్యాటిల్ రాయల్ గేమ్ ఫుట్‌బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీతో కలిసి పనిచేసింది. కంపెనీ ప్రకారం.. PUBG మొబైల్ 2.3 అప్‌డేట్ రిలీజ్ చేసింది. ఈ అప్ డేట్‌ను ఆటగాళ్లందరూ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
PUBG Mobile 2.3 Update _ Football edition rolls out in collaboration with Messi
గేమ్ ప్లేయర్లు.. కొన్ని ఉచిత ఐటెమ్‌లు, AGలు, BPలను కూడా క్లెయిమ్ చేయవచ్చు. PUBG మొబైల్ ప్లేయర్‌లందరూ తమ గేమ్ యాప్‌లను లేటెస్ట్ వెర్షన్‌కి అప్‌డేట్ చేసుకునేలా గేమ్ అప్‌డేట్ నవంబర్ 17నుంచి అందుబాటులోకి వచ్చింది. ఆసక్తికరంగా, బ్యాటిల్-రాయల్ గేమ్, లియోనెల్ మెస్సీ భాగస్వామ్యంలో భాగంగా.. కొన్ని ఫుట్‌బాల్ ఆధారిత ఈవెంట్‌లు గేమ్‌లో అందుబాటులో ఉన్నాయి. టెన్సెంట్ కంపెనీ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా లియోనెల్ మెస్సీ x PUBG మొబైల్ ఈవెంట్ కోసం షెడ్యూల్‌ను కూడా రిలీజ్ చేసింది. ఈ గేమింగ్ ఈవెంట్ మూడు దశలుగా వచ్చింది. ఈవెంట్ షెడ్యూల్ ఓసారి లుక్కేయండి..
Exclusive Collaboration Jersey :
నవంబర్ 10 నుంచి ప్రారంభమై డిసెంబర్ 18న ఇది ముగుస్తుంది. ఈ దశలో.. మెస్సీ నేపథ్య ఈవెంట్‌లో చేరిన ప్రతి ప్లేయర్ ప్రత్యేకమైన జెర్సీని పొందవచ్చు.
Messi’s Golden Shoes :
ఈ దశ నవంబర్ 17 నుంచి ప్రారంభమవుతుంది. జనవరి 03, 2023న ఈ అప్‌డేట్ ముగుస్తుంది. ఈ దశలో ఈవెంట్‌లో గోల్డెన్ షూస్ రూపంలో గేమ్‌లో కొత్త వ్యూహాత్మక అంశం ఉంటుంది.
PUBG Mobile 2.3 Update _ Football edition rolls out in collaboration with Messi
Outfits and Items :
ఈ దశ నవంబర్ 23 నుంచి ప్రారంభమవుతుంది. డిసెంబర్ 31, 2022న ముగుస్తుంది. ఈ దశలో.. ఈవెంట్‌లో ఆటగాళ్లకు బంపర్ లూట్ ఉంటుంది. మెస్సీకి సంబంధించిన వస్తువులు, దుస్తులు ఆటగాళ్లందరికీ అందుబాటులో ఉంటాయి. అప్‌డేట్ సైజు గురించి చెప్పాలంటే.. ఆండ్రాయిడ్ ఫోన్ల కోసం PUBG మొబైల్ 2.3 అప్‌డేట్ సైజు 688 MB, iPhone యూజర్ల కోసం 1.84 GBతో వచ్చింది.
మీరు అప్‌డేట్‌ను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలా? అని చూస్తున్నారా? PUBG మొబైల్ 2.3 అప్‌డేట్ APKని కంపెనీ అధికారిక వెబ్‌సైట్ నుంచి సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. Apple యూజర్ల కోసం.. యాప్ స్టోర్‌కు వెళ్లాలి. సంబంధిత స్టోర్ నుంచి అప్‌డేట్ డౌన్‌లోడ్ చేసుకోవాలి.
WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..