Chintan Shivir
Chintan Shivir: రాజస్థాన్‌లోని ఉదయ్ పూర్‌లో రెండోరోజు కాంగ్రెస్ నవ సంకల్స్ చింతన్ శివిర్ కొనసాగుతోంది. తాజ్ ఆరావళి హోటల్‌లో ఉదయం పది గంటలకు పార్టీ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రాల ఇన్‌ఛార్జ్‌లు, రాష్ట్ర అధ్యక్షులు, శాసన సభా పక్ష నేతలతో రాహుల్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్న తర్వాత పార్టీ నేతలందరితో భేటీ కావడం ఇదే తొలిసారి. రెండో రోజు బృంద చర్చలు ప్రారంభమవ్వడానికి ముందు ఈ భేటీ జరిగింది.
Congress: కాంగ్రెస్ చింతన్ శివిర్.. సమూల మార్పులకు పార్టీ సిద్ధం
రాహుల్ గాంధీని పార్టీ అధ్యక్షుడిగా ప్రకటించాలని డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో, ఆయన పార్టీ కీలక నేతలతో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సమావేశంలో పార్టీకి సంబంధించిన అంశాలతోపాటు, దేశ ఆర్థిక వ్యవస్థ, రాజకీయాలు, ఇతర అంశాలపై కూడా చర్చిస్తారు.