Rahul Gandhi: రాహుల్ గాంధీ పాదయాత్ర చేయబోతున్నారా?
రాహుల్ గాంధీ ప్రజలకు మరింత దగ్గరయ్యే లక్ష్యంతో ఈ పాదయాత్ర చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ యాత్ర కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సాగనుంది.
- Narender Thiru
- Updated on- May 15, 2022 / 09:21 AM IST
Rahul Gandhi
Rahul Gandhi: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ త్వరలో పాదయాత్ర చేయబోతున్నారా? ఈ విషయంపై కాంగ్రెస్ ‘నవ సంకల్స్ చింతన్ శివిర్’లో చర్చ జరిగింది. రాహుల్ గాంధీ ప్రజలకు మరింత దగ్గరయ్యే లక్ష్యంతో ఈ పాదయాత్ర చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ యాత్ర కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సాగనుంది. వచ్చే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, ఈ ఏడాది చివరి నుంచి యాత్ర ప్రారంభించాలని కాంగ్రెస్ భావిస్తోంది. అయితే, ఈ యాత్రపై సోనియా గాంధీతోపాట, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
మరోవైపు రాష్ట్రాల్లో కూడా ఆ పార్టీ నేతల ఆధ్వర్యంలో పాదయాత్ర చేయాలని కాంగ్రెస్ ఆలోచన. వివిధ రాష్ట్రాల్లో పాదయాత్ర ద్వారా అధికార పార్టీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ అనుకుంటోంది. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ద్రవ్యోల్బణం, ఆర్థిక సంక్షోభం వంటి అంశాల్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమాలపై పార్టీ దృష్టి సారించనుంది. దేశం ప్రస్తుతం కాంగ్రెస్ వైపు చూస్తోందని, పార్టీ ఐక్యంగా ఉందనే సందేశాన్ని ప్రజల్లోకి పంపాలని ఇటీవల సోనియా గాంధీ అన్నారు.
