Rains In Telangana : బంగాళాఖాతంలో అల్పపీడనం-తెలంగాణలో నేడు,రేపు భారీ వర్షాలు

పశ్చిమ మధ్య బంగా‌ళా‌ఖా‌తం‌లోని ఉత్తర ఆంధ్రప్రదేశ్‌ తీరంలో ఉన్న ఆవ‌ర్తనం వాయవ్య బంగా‌ళా‌ఖాతం పరి‌సర ప్రాంతాల్లో కొన‌సా‌గు‌తు‌న్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు చెప్పారు.

Rains In Telangana :  పశ్చిమ మధ్య బంగా‌ళా‌ఖా‌తం‌లోని ఉత్తర ఆంధ్రప్రదేశ్‌ తీరంలో ఉన్న ఆవ‌ర్తనం వాయవ్య బంగా‌ళా‌ఖాతం పరి‌సర ప్రాంతాల్లో కొన‌సా‌గు‌తు‌న్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు చెప్పారు. ఆవర్తనం సగటు సముద్రమ‌ట్టా‌నికి 5.8 కి.మీ. ఎత్తు వరకు విస్తరించి ఎత్తుకు వెళ్లే కొందీ నైరుతి దిశగా వంపు తిరిగి ఉన్నదని చెప్పారు. ఈ ఆవ‌ర్తన ప్రభా‌వంతో రాగల 24 గంటల్లో వాయవ్య బంగా‌ళా‌ఖాతం పరి‌సర ప్రాంతాల్లో అల్పపీ‌డనం ఏర్పడే అవ‌కా‌శ‌ము‌న్నదని పేర్కొ‌న్నారు.

దీని ప్రభావంతో ఆది, సోమ‌వా‌రాల్లో తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవ‌కాశం ఉన్నదని వాతా‌వ‌రణ కేంద్రం అధికారులు హెచ్చరిం‌చారు. ఆది‌వారం ఉరు‌ములు మెరు‌పు‌లతో వర్షాలు పడ‌వ‌చ్చని వాతా‌వ‌రణ కేంద్రం డైరె‌క్టర్‌ నాగ‌రత్న తెలి‌పారు. దీని‌వల్ల రానున్న మూడు‌రోజు‌లు వర్షంతో పాటు గంటకు 30 నుంచి 40 కిలో‌ మీ‌టర్ల వేగంతో ఈదు‌రు‌ గా‌లులు వీచే అవ‌కాశం ఉన్నదని తెలి‌పారు.

రాగల 3 గంటల్లో ఆదిలాబాద్, కుమురంభీమ్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల్, మంచిర్యాల్, పెద్దపల్లి, సిరిసిల్ల, జనగాం, జయశంకర్ భూపాల పల్లి, కరీంనగర్ల జిల్లాలలో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు