RRR: అప్పుడే కోతలు పెడుతున్న జక్కన్న..?

స్టార్ డైరెక్టర్ రాజమౌళి బాహుబలి చిత్రంతో అంతర్జాతీయ స్థాయిలో తన సత్తా ఏమిటో చాటుకున్నాడు. ఇక ఆ సినిమా ఇచ్చిన సక్సెస్ తరువాత కొంత గ్యాప్ తీసుకుని ఇప్పుడు మరో.....

Rajamouli Removes An Important Scene For Ntr In Rrr

RRR: స్టార్ డైరెక్టర్ రాజమౌళి బాహుబలి చిత్రంతో అంతర్జాతీయ స్థాయిలో తన సత్తా ఏమిటో చాటుకున్నాడు. ఇక ఆ సినిమా ఇచ్చిన సక్సెస్ తరువాత కొంత గ్యాప్ తీసుకుని ఇప్పుడు మరో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ చిత్రం అనౌన్స్‌మెంట్ నుండే ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలను క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యింది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన అన్ని రకాల పనులు పూర్తి కావడంతో ఈ సినిమా రిలీజ్ డేట్‌ను లాక్ చేసుకుంది. గతంలోనే ఈ సినిమాను రిలీజ్ చేస్తామని జక్కన్న చెప్పినా, కరోనా కారణంగా పలుమార్లు వాయిదా వేస్తూ వచ్చారు. ఇక ఈనెల 25న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు జక్కన్న అండ్ టీమ్ రెడీ అయ్యింది.

RRR: ‘మహాప్రభో.. నన్ను వదిలేయండి’.. జక్కన్నకు దండం పెట్టిన తారక్!

ఈ చిత్రంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వంటి ఇద్దరు మేటి స్టార్స్ నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్నాయి. కాగా ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ పనులు కూడా పూర్తయినట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సెన్సార్ నుండి U/A సర్టిఫికెట్ రాగా, ఈ చిత్ర రన్‌టైమ్ 3 గంటల 6 నిమిషాల 54 సెకన్లుగా ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే ఇప్పటికే ఈ రన్‌టైమ్ ఎక్కవని భావిస్తున్న చిత్ర యూనిట్, ఈ సినిమాలోని చాలా సీన్స్‌ను కట్ చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అన్ని విషయాల్లోనూ పర్ఫెక్షన్ కోరుకునే జక్కన్న, సినిమా నిడివి పెద్దగా ఉండకూడదని భావించి ఈ సినిమాలోని ఓ కీలక సన్నివేశాన్ని కట్ చేసినట్లు తెలుస్తోంది.

ఎన్టీఆర్ నటించిన కొమురం భీం పాత్రకు సంబంధించిన ఓ సీన్ ఏకంగా 1 నిమిషం 36 సెకన్లు ఉండగా, దాన్ని దర్శకుడు రాజమౌళి కట్ చేసినట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. నిమిషానికిపైగా ఉన్న సీన్ అంటే అది ఖచ్చితంగా ముఖ్యమైనదే అయ్యి ఉంటుందని.. అలాంటి సీన్‌ను జక్కన్న ఎందుకు తొలగించాడా అని ప్రేక్షకులు ఆలోచిస్తున్నారు. అయితే మూడు గంటలకు పైగా ఉన్న సినిమాను ప్రేక్షకులు రన్‌టైమ్‌తో సంబంధం లేకుండా ఎంజాయ్ చేస్తే, అప్పుడు ఈ తొలగించిన సీన్‌ను యాడ్ చేయాలని జక్కన్న భావిస్తున్నాడట.

RRR: ఆర్ఆర్ఆర్ మరో రికార్డు.. ఏకంగా మిలియన్ మంది!

ఏదేమైనా తారక్ పాత్రకు సంబంధించిన ముఖ్యమైన సీన్‌ను జక్కన్న తొలగించడంపై తారక్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. సినిమాలోని అనసవరమైన సీన్స్ ఏవైనా ఉంటే, అవి తొలగించవచ్చు కదా.. తమ హీరో సీన్‌నే ఎందుకు తొలగించావో చెప్పు జక్కన్న అంటున్నారు నందమూరి అభిమానులు. మరి కొమురం భీం సీన్‌ను దర్శకుడు ఎందుకు తొలగించాడో తెలియాలంటే మాత్రం ఆర్ఆర్ఆర్ బొమ్మ వెండితెరపై పడే వరకు ఆగాల్సిందే.