RRR: ఆర్ఆర్ఆర్ మరో రికార్డు.. ఏకంగా మిలియన్ మంది!

టాలీవుడ్ బిగ్గెస్ట్ మూవీగా వస్తున్న ఆర్ఆర్ఆర్ కోసం యావత్ సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్.రాజమౌళి తెరకెక్కించిన ఈ భారీ చిత్రాన్ని....

RRR: ఆర్ఆర్ఆర్ మరో రికార్డు.. ఏకంగా మిలియన్ మంది!

1 Million Interests For Rrr On Book My Show

RRR: టాలీవుడ్ బిగ్గెస్ట్ మూవీగా వస్తున్న ఆర్ఆర్ఆర్ కోసం యావత్ సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్.రాజమౌళి తెరకెక్కించిన ఈ భారీ చిత్రాన్ని చూసేందుకు తెలుగు ఆడియెన్స్‌తో పాటు ఇతర ఇండస్ట్రీల ఆడియెన్స్ కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఓవర్సీస్ ఆడియెన్స్ గురించి చెప్పనక్కర్లేదు. ఇప్పటికే 1.5 మిలియన్ ప్రీబుకింగ్ సేల్సో‌తో బాక్సాఫీస్‌ను దడదడలాడిస్తున్నారు. త్వరలోనే ఈ మార్క్ 2 మిలియన్‌కు చేరుతుందని ట్రేడ్ నిపుణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

RRR Ticket‌ : ఏపీలో RRR మూవీ టికెట్‌ ధరలు పెంచుతూ ప్రభుత్వం జీవో విడుదల

ఇదిలా ఉంటే, సినిమా రిలీజ్‌కు ముందే ఈ చిత్రం పలు రికార్డులు క్రియేట్ చేస్తూ తన సత్తా చాటుతుంటే, ఇప్పుడు మరో అరుదైన రికార్డును తన పేరిట నమోదు చేసుకుంది. ప్రముఖ ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫాం ‘బుక్ మై షో’ పోర్టల్‌లో RRR చిత్రం కోసం ఏకంగా 1 మిలియన్ మంది ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. ఈ సినిమాపై ఎలాంటి క్రేజ్ నెలకొందో తెలిపేందుకు ఇదొక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే. దర్శకధీరుడు రాజమౌళి విజన్‌తో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఇద్దరు స్టార్ హీరోలు నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.

ఇక ఇటీవల ఈ సినిమా ప్రమోషన్స్‌ను ఓ రేంజ్‌లో నిర్వహిస్తూ చిత్ర యూనిట్ ఈ సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేస్తోంది. కాగా ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో నటిస్తుండగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు. దీంతో వీరిద్దరిని కలిసి ఒకే స్క్రీన్‌పై చూసేందుకు ఇద్దరు హీరోల అభిమానులు కూడా ఎంతో ఆతృతగా చూస్తున్నారు. ఇక మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న ఈ సినిమాను తొలి రోజు చూసేందుకు ప్రేక్షకులు ఇప్పట్నుండే ప్రయత్నాలు చేస్తున్నారు.

RRR: RRR చిత్ర యూనిట్ కు గుడ్ న్యూస్

పీరియాడికల్ డ్రామాకు ఫిక్షన్‌ను జోడించి జక్కన్న ఈ సినిమాను మలిచిన తీరు అద్భుతంగా ఉండబోతుందని చిత్ర యూనిట్ ఇప్పటికే పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చింది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్గన్ పాత్ర కూడా ప్రేక్షకులను ఇంప్రెస్ చేయడం ఖాయమని, ఆలియా భట్, ఒలివియా మారిస్‌ల పర్ఫార్మెన్స్ ఈ సినిమాకు అదనపు ఆకర్షణగా మారుతుందని RRR యూనిట్ అంటోంది. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాను డివివి.దానయ్య అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేశారు. ఈ సినిమాకు ఉన్న అడ్డంకులు తొలిగిపోవడంతో, ఇకపై ప్రమోషన్స్‌ను రెట్టింపు ఉత్సాహంతో చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యారు.