US Iran War: అమెరికాతో యుద్ధం.. ఇరాన్ సంచలన ప్రకటన..
నిన్నటి వరకు శుద్ధి చేసిన యురేనియంను అప్పగించే ప్రసక్తే లేదన్న ఇరాన్ ఇప్పుడు మాత్రం వెనకడుగు వేసినట్లు తెలుస్తోంది.
US Iran War: పశ్చిమాసియా యుద్ధానికి ఎండ్ కార్డ్ పడనుందా? 3 నెలలకు పైగా సాగిన వార్ ఇక ముగియనుందా? అంటే, అవుననే సంకేతాలే వినిపిస్తున్నాయి. డీల్ కు ఇరాన్ అతి దగ్గరగా ఉందంటూ ట్రంప్ వరుస ట్వీట్లతో హోరెత్తించారు. అయితే, తాజాగా ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. తమకు అణ్వాయుధాలు అవసరం లేదని, ప్రపంచ అణు నిబంధనలకు కట్టుబడి ఉంటామని ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ ప్రకటించారు. అణ్వాయుధాల విషయంలో ప్రపంచానికి భరోసా ఇస్తున్నట్లు తెలిపారు. దీంతో ఇక 3 నెలల పాటు సాగిన పశ్చిమాసియా వార్ కు ఎండ్ కార్డ్ పడే ఛాన్స్ ఉంది.
అమెరికా ఒత్తిడికి ఇరాన్ తలొగ్గినట్లు తెలుస్తోంది. నిన్నటి వరకు శుద్ధి చేసిన యురేనియంను అప్పగించే ప్రసక్తే లేదన్న ఇరాన్ ఇప్పుడు మాత్రం వెనకడుగు వేసినట్లు తెలుస్తోంది. తమ దగ్గర ఉన్న 440 కిలోల ఎన్ రిచ్డ్ యురేనియంను వదులుకోవడానికి ఇరాన్ అంగీకరించినట్లు అమెరికా మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ నిర్ణయంతో ఇరాన్ అమెరికాకు లొంగిపోయినట్లేనని నిపుణులు భావిస్తున్నారు. ఇరాన్ తన దగ్గరున్న యురేనియంను అప్పగిస్తే మధ్య ప్రాచ్యంలో చారిత్రక మలుపు చోటు చేసుకోనుంది.
Also Read: ఎబోలా టెన్షన్.. ఆ దేశాలకు వెళ్లొద్దు.. భారతీయులకు కేంద్రం అలర్ట్..
