RRR: ‘మహాప్రభో.. నన్ను వదిలేయండి’.. జక్కన్నకు దండం పెట్టిన తారక్!

ఎప్పుడెప్పుడా అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న RRR మూవీ మరికొద్ది రోజుల్లో మనమందుకు రాబోతుంది. మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేస్తుండటంతో.....

RRR: ‘మహాప్రభో.. నన్ను వదిలేయండి’.. జక్కన్నకు దండం పెట్టిన తారక్!

Ntr Fun In The Forces Of Rrr Interview

RRR: ఎప్పుడెప్పుడా అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న RRR మూవీ మరికొద్ది రోజుల్లో మనమందుకు రాబోతుంది. మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేస్తుండటంతో ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేందుకు ఆడియెన్స్ రెడీ అవుతున్నారు. ఇక ఈ సినిమాను ప్రేక్షకుల్లోకి మరింతగా తీసుకెళ్లేందుకు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రమోషన్స్‌ను ఓ రేంజ్‌లో నిర్వహిస్తుంది. ఇటీవల దర్శకుడు అనిల్ రావిపూడితో RRR యూనిట్ చేసిన ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. కాగా ఇప్పుడు తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్, దర్శకుడు రాజమౌళి కలిసి ఈ సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను ఓ ప్రమోషనల్ వీడియోలో పంచుకున్నారు.

RRR: ఆర్ఆర్ఆర్ మరో రికార్డు.. ఏకంగా మిలియన్ మంది!

ఈ క్రమంలో తారక్, చరణ్, జక్కన్న కలిసి చేసిన సందడి.. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. RRR చిత్ర ప్రమోషన్స్‌ను ఏ విధంగా చేయాలని, ఎవరెవరు ఎలాంటి డ్రెస్ వేసుకోవాలని జక్కన్న చెబుతుండటంతో తారక్ తనదైన మార్క్ కామెడీతో నవ్వులు పూయించాడు. ‘‘మహాప్రభో.. నన్ను వదిలేయండి.. ఎలాగోలా ప్రమోషన్స్ ఈవెంట్ కి వచ్చి సస్తా..’’ అంటూ తారక్ జక్కన్నకు దండం పెడుతూ వేడుకోవడం.. ఇక తన వల్ల కాదని.. చరణ్‌తోనే ప్రమోషన్స్‌ను లాగించమని తారక్ చేసిన కామెడీ ఈ వీడియోలో హైలైట్‌గా నిలిచిందని చెప్పాలి.

ఇలా ఆర్ఆర్ఆర్ చిత్రానికి సంబంధించి చాలా విషయాలను ఈ ప్రమోషనల్ వీడియోలో వారు షేర్ చేసుకున్న విధానం ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. తారక్ ఎనర్జీకి అభిమానులైతే ఫుల్ ఫిదా అవుతున్నారు. ఇక ఈ సినిమాలో తమ పాత్రలకు సంబంధించిన విషయాలను.. అటు సినిమాను ప్రపంచవ్యాప్తంగా ప్రమోట్ చేసేందుకు తమ ప్రణాళికను కూడా వారు ఈ వీడియోలో చర్చించుకున్నారు. కాగా సినిమాలోని కీలక సన్నివేశాలు, వాటి వెనక ఉన్న కష్టాలను గుర్తుకుచేసుకున్నారు.

NTR : నా భార్య బర్త్‌డే వదిలేసి చరణ్ కోసం వెళ్ళేవాడిని

ఏదేమైనా RRR రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ఈ సినిమా ప్రమోషన్స్‌ను ఒక్కసారిగా పెంచేశారు చిత్ర యూనిట్. ఇక దేశంలోని పలు నగరాల్లో ఈ సినిమా ప్రమోషన్స్‌ను నిర్వహించేందుకు రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేసుకుంది చిత్ర యూనిట్. కొమురం భీం పాత్రలో తారక్, అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్‌ల పర్ఫార్మెన్స్ ఈ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. కాగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందా అని సినీ విశ్లేషకులు అప్పుడే లెక్కలు వేస్తున్నారు.