Rakesh Tikait: బీకేయూ నుంచి రాకేష్ టికాయత్ బహిష్కరణ

రైతు ఉద్యమ నేతగా గుర్తింపు పొందిన రాకేష్ టికాయత్‌ను బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకుంది భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ). కొంతకాలంగా జరుగుతున్న రైతు ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నేతల్లో రాకేష్ టికాయత్ ఒకరు.

Rakesh Tikait

Rakesh Tikait: రైతు ఉద్యమ నేతగా గుర్తింపు పొందిన రాకేష్ టికాయత్‌ను బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకుంది భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ). కొంతకాలంగా జరుగుతున్న రైతు ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నేతల్లో రాకేష్ టికాయత్ ఒకరు. ముఖ్యంగా 2020లో జరిగిన కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక రైతు ఉద్యమాన్ని ఆయనే ముందుండి నడిపించారు. ఇప్పటికీ రైతు ఉద్యమంలో పాల్గొంటున్నారు. అయితే, ఆయన ఉద్యమాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయాలకు పాల్పడుతున్నారని రైతు సంఘం నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన్ను బీకేయూ నుంచి బహిష్కరించినట్లు తెలుస్తోంది. రాకేష్‌తోపాటు ఆయన సోదరుడు నరేష్ టికాయత్‌ను కూడా బీకేయూ తొలగించింది.

Delhi Mundka Fire : ఢిల్లీ అగ్నిప్రమాదం.. ఇంకా 29మంది మిస్సింగ్.. మెజిస్టీరియ‌ల్ విచార‌ణ‌కు సీఎం ఆదేశం

ఆయన్ను అధ్యక్ష పదవి నుంచి తప్పించారు. నరేష్ టికాయత్ స్థానంలో రాజేష్ సింగ్ చౌహాన్ ఈ పదవి బాధ్యతలు స్వీకరిస్తారు. ఆదివారం నుంచే ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. ప్రస్తుత పరిణామాల రీత్యా బీకేయూ రెండుగా చీలే అవకాశం కనిపిస్తోంది. ఈ నిర్ణయంపై ఇంకా రాకేష్ టికాయత్ స్పందించలేదు. ఇటీవల వరి కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో కేసీఆర్ చేపట్టిన దీక్షలో కూడా రాకేష్ టికాయత్ పాల్గొన్నారు.