Ram Charan
Ram Charan: ఈ కరోనా మహమ్మారి సెకండ్ వేవ్‌లో బీభత్సం సృష్టిస్తోంది.. బాధితులను ఆదుకోవడానికి, అవసరమైన వారికి సాయం చెయ్యడానికి చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్, మెగాభిమానులు పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో అహర్నిశలూ శ్రమిస్తూ.. ఆపదలో ఉన్నవారికి సాయమందిస్తున్న అభిమానులను అభినందించారు మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్..
Chiranjeevi Oxygen Bank : తెలుగు రాష్ట్రాల్లో చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ఆక్సిజన్ బ్యాంకులు..
‘‘అభిమానులు కోవిడ్-19 క్లిష్ట సమయంలో కష్టపడి చేస్తున్న సేవల గురించి నేను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉన్నాను. అత్యవసర పరిస్థితిలో ఉన్న సామాన్యుడికి సహాయం చేయటం నుండి ఎన్నో సేవా కార్యక్రామాల్లో పాల్గొనటం వరకు మీరు ఎంతో అంకిత భావంతో పని చేశారు. ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి ఎందరికో సహాయం చేసిన మీ అందరికీ పేరు పేరున నా శుభాభినందనలు..’’ అంటూ రామ్ చరణ్ ట్వీట్ చేశారు..
అలాగే కోవిడ్ 19 కారణంగా నెలకొన్న ఆక్సిజన్ కొరతను అరికట్టడానికి మెగాస్టార్ చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆక్సిజన్ బ్యాంక్‌లు ఏర్పాటు చేశారు. ఈ ఆక్సిజన్ బ్యాంక్‌లను రామ్ చరణ్ పర్యవేక్షిస్తున్నారు. రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో కలిసి నటిస్తున్న చరణ్.. తండ్రి చిరంజీవి ‘ఆచార్య’ లో కీ రోల్ ప్లే చేస్తున్నారు. తర్వాత సిల్వర్ స్ర్కీన్ సెల్యూలాయిడ్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చెయ్యబోతున్నారు.
— Ram Charan (@AlwaysRamCharan) June 5, 2021