Chiranjeevi Oxygen Bank : తెలుగు రాష్ట్రాల్లో చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ఆక్సిజన్ బ్యాంకులు..

కోవిడ్ 19 కారణంగా నెలకొన్న ఆక్సిజన్ కొరతను అరికట్టడానికి మెగాస్టార్ చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆక్సిజన్ బ్యాంక్‌లు ఏర్పాటు చెయ్యనున్నారు..

Chiranjeevi Oxygen Bank : తెలుగు రాష్ట్రాల్లో చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ఆక్సిజన్ బ్యాంకులు..

Chiranjeevi Oxygen Bank

Chiranjeevi Oxygen Bank: కోవిడ్ 19 కారణంగా నెలకొన్న ఆక్సిజన్ కొరతను అరికట్టడానికి మెగాస్టార్ చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆక్సిజన్ బ్యాంక్‌లు ఏర్పాటు చెయ్యనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రతి జిల్లాలో ఆక్సిజన్ బ్యాంక్‌లు ఏర్పాటు చేస్తున్నట్టు చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు తెలియజేశారు. ఈ ఆక్సిజన్ బ్యాంక్‌లను మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ పర్యవేక్షించనున్నారు.

Chiranjeevi : కార‌వ్యాన్ డ్రైవ‌ర్ కుటుంబానికి చిరంజీవి సాయం..

రక్తం దొరక్క ఎవరు మరణించకూడదనే సంకల్పంతో 1998 లో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నెలకొల్పారు. ఈ కరోనా కష్ట కాలంలో ఆక్సిజన్ అందక ఎవరు మరణించకూడదనే సంకల్పంతో ప్రతి జిల్లాలోను చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకును నెలకొల్పాలని నిర్ణయించారు. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరత వల్ల ఏ ఒక్కరూ మరణించకూడదన్న ఉద్దేశంతో ఓ బృహత్తర ప్రణాళికను రూపొందించారు. అలా యుద్దప్రాతిపదికన ఆక్సిజన్ బ్యాంక్ ఏర్పాటవుతోంది.

వారం రోజుల్లో ఈ బ్యాంక్ తన సేవలను ప్రారంభించబోతోంది. ఆ ఆక్సిజన్ బ్యాంక్ పర్యవేక్షణ బాధ్యత అంతా రామ్ చరణ్ పర్యవేక్షిస్తారు. మెగా అభిమానులను కూడా ఇందులో భాగస్వాముల్ని చేయబోతున్నారు. ఆయా జిల్లాల అభిమాన సంఘాల అధ్యక్షులు అక్కడ వీటి నిర్వహణ బాధ్యత చూస్తారు. చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ ఆక్సిజన్ బ్యాంక్ ఏర్పాటవుతోంది. దీని అధికారిక ప్రకటనను ట్విట్టర్ ద్వారా రామ్ చరణ్ విడుదల చేశారు. తెలుగువారందరికీ ఈ ఆక్సిజన్ బ్యాంక్ అందుబాటులో ఉంటుంది. దీని కోసం ప్రత్యేకంగా ట్విట్టర్ అకౌంటును కూడా ప్రారంభించారు. ఇప్పుడున్న ఆక్సిజన్ సంక్షోభాన్ని అరికట్టే ఉద్దేశంతోనే దీన్ని ప్రారంభించబోతున్నట్లు వివరించారు.