×
Ad

Chiru – Charan : మెగా పిక్.. చెర్రీ షర్ట్ కాస్ట్ ఎంతంటే..!

ఫాదర్స్ డే సందర్భంగా తండ్రికి విషెస్ చెబుతూ చరణ్ షేర్ చేసిన పిక్ బాగా వైరల్ అయ్యింది..

  • Published On : June 26, 2021 / 06:30 PM IST

Chiru – Charan

Chiru – Charan: మెగాస్టార్ చిరంజీవి – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి కనిపిస్తే మెగాభిమానులకు చూడ్డానికి రెండు కళ్లు సరిపోవు.. ఇప్పటివరకు ‘మగధీర’ ‘బ్రూస్‌లీ’ ‘ఖైదీ నంబర్ 150’ సినిమాల్లో మెగా ఫాదర్ అండ్ సన్ ఆన్‌స్క్రీన్ మీద అభిమానుల్ని అలరించారు. ఇప్పుడు ‘ఆచార్య’ లోనూ అదరగొట్టబోతున్నారు.

Ram Charan Fans : ‘మెగా’భిమానం.. నాలుగు రోజులు కాలినడక..!

ఫాదర్స్ డే సందర్భంగా తండ్రికి విషెస్ చెబుతూ చరణ్ షేర్ చేసిన పిక్ బాగా వైరల్ అయ్యింది. చిరు, చరణ్ ఇద్దరూ స్టైలిష్ లుక్‌లో మెరిసిపోయారు. గ్లామర్ విషయంలో తనయుడికి మెగాస్టార్ గట్టి పోటీ ఇచ్చారనే చెప్పాలి. చిరు టీ షర్టులో, చెర్రీ బ్లాక్ డ్రెస్‌లో ఉన్న ఫొటో నెట్టింట వైరల్ అయ్యింది కదా అని సరిగ్గా గమనిస్తే చరణ్ వేసుకున్న షర్ట్ గురించి సర్‌ప్రైజింగ్ విషయం తెలిసింది..

Ram Charan : ‘వాచ్ అమ్మితే బ్యాచ్ సెట్లైపోద్ది’.. రామ్ చరణ్ వాచ్, టీషర్ట్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు..

చరణ్ వేసుకున్న షర్ట్ మీద పాపులర్ ఫ్యాషన్ బ్రాండ్ గివెన్చీ (Givenchy) సిగ్నేచర్ లోగో ఉంది. దీని కాస్ట్ ఎంతో తెలుసా..? అక్షరాలా 49, 305 రూపాయలు.. ఇంతకుముందు చరణ్ పెట్టుకున్న సన్ గ్లాసెస్, వాచెస్ రేటుకి సంబంధించి వార్తలు వైరల్ అయ్యాయి. పాన్ వరల్డ్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ తో పాటు, తండ్రి హీరోగా నటిస్తున్న ‘ఆచార్య’ లో సిద్ధ అనే ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తున్నారు మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్.