Ram Temple Construction: ఆలోగా అయోధ్యలో రామ మందిర నిర్మాణం పూర్తవుతుంది: తీర్థ క్షేత్ర ట్రస్ట్

అయోధ్యలో రామ మందిర నిర్మాణం వచ్చే ఏడాది డిసెంబరులోగా పూర్తవుతుందని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ అన్నారు. వచ్చే ఏడాది డిసెంబరు నుంచి శ్రీరామ్ లల్లాను ప్రజలు దర్శించుకోవచ్చని చెప్పారు. రామ మందిర నిర్మాణ పనులు సమర్థంగా కొనసాగుతున్నాయని తెలిపారు. రామ మందిర నిర్మాణంలో ఇనుమును వాడడం లేదని అన్నారు. ప్రజలను బాగా ఆకట్టుకునేలా రామ మందిర డిజైన్ ను రూపొందించినట్లు చెప్పారు.

Ram Temple Construction: అయోధ్యలో రామ మందిర నిర్మాణం వచ్చే ఏడాది డిసెంబరులోగా పూర్తవుతుందని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ అన్నారు. వచ్చే ఏడాది డిసెంబరు నుంచి శ్రీరామ్ లల్లాను ప్రజలు దర్శించుకోవచ్చని చెప్పారు. రామ మందిర నిర్మాణ పనులు సమర్థంగా కొనసాగుతున్నాయని తెలిపారు. రామ మందిర నిర్మాణంలో ఇనుమును వాడడం లేదని అన్నారు. ప్రజలను బాగా ఆకట్టుకునేలా రామ మందిర డిజైన్ ను రూపొందించినట్లు చెప్పారు.

కాగా, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రామ మందిర ఆలయ నిర్మాణ పర్యవేక్షణ, నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం ట్రస్టును ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. భూకంపాలు, తుపాన్లతో పాటు ఇతర ప్రకృతి వైపరీత్యాలకు తట్టుకునేలా రామ మందిర ఆలయ నిర్మాణం జరుగుతుండడంతో నిర్మాణంలో ఇనుమును వాడడం లేదు. వేల ఏళ్ళయినా చెక్కు చెదరకుండా ఉండడానికి రాతితో నిర్మిస్తున్న మందిరంలో రాయి, రాయికి మధ్య రాగి పలకల్ని ఏర్పాటు చేస్తున్నారు.

మరోవైపు, అయోధ్యలో భూములకు సంబంధించి కొందరు అక్రమంగా ఒప్పందాలు చేసుకోవడం కలకలం రేపింది. అయోధ్య బీజేపీ ఎమ్మెల్యే, మేయర్‌తో పాటు మాజీ ఎమ్మెల్యే తదితర 40 మంది పేర్లను అయోధ్య అభివృద్ధి అథారిటీ తాజాగా ప్రకటించి, వారు అక్రమంగా అయోధ్యలో క్రయవిక్రయాలు జరపడం, కాలనీలను నిర్మించడం వంటి చర్యలకు పాల్పడ్డారని పేర్కొంది.

Viral Video: తమిళనాడు ఆర్థిక మంత్రి త్యాగరాజన్ కారుపై చెప్పు విసిరిన బీజేపీ కార్యకర్తలు

ట్రెండింగ్ వార్తలు