Mukesh Ambani: ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో టాప్-3లో భారత్ నిలుస్తుంది: ముకేశ్ అంబానీ

భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి, అవకాశాలు అసాధారణ స్థాయిలో దూసుకెళ్తున్నాయని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ అన్నారు. 3 ట్రిలియన్ డాలర్ల నుంచి 2047 నాటికి 40 ట్రిలియన్ డాలర్లకు పెరుగుతుందని చెప్పారు. ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో టాప్-3లో భారత్ ఉంటుందని అన్నారు.

Mukesh Ambani: భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి, అవకాశాలు అసాధారణ స్థాయిలో దూసుకెళ్తున్నాయని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ అన్నారు. 3 ట్రిలియన్ డాలర్ల నుంచి 2047 నాటికి 40 ట్రిలియన్ డాలర్లకు పెరుగుతుందని చెప్పారు. ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో టాప్-3లో భారత్ ఉంటుందని అన్నారు.

గుజరాత్, గాంధీనగర్ లోని పండిట్ దీనదయాళ్ ఎనర్జీ యూనివర్సిటీ 10వ స్నాతకోత్సవంలో వర్చువల్ పద్ధతిలో పాల్గొన్న ముకేశ్ అంబానీ ఈ సందర్భంగా ప్రసంగించారు. క్లీన్ ఎనర్జీ, బయో-ఎనర్జీ, డిజిటల్ విప్లవం వంటివి భారతదేశ ఆర్థిక వృద్ధికి కారణాలవుతాయని అన్నారు. అవి మన జీవితాలనే మార్చేస్తాయని చెప్పారు. అలాగే, అవి ప్రపంచాన్ని వాతావరణ సంక్షోభం నుంచి కాపాడతాయని అన్నారు.

భారత్ కు క్లీన్ ఎనర్జీ, బయో-ఎనర్జీ, డిజిటల్ విప్లవం అవసరమని చెప్పారు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న వారు దేశ అభివృద్ధి కోసం పాటుపడాలని అన్నారు. కలలుకని వాటిని సాకారం చేసుకోవాలని సూచించారు. క్షమశిక్షణతో కూడిన పనులతో వాటిని సాధించాలని చెప్పారు. వీలుకాని వాటిని ఆయా విషయాలే సాధ్యపడేలా చేస్తాయని తెలిపారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

ట్రెండింగ్ వార్తలు