Raviteja Massive Announcement From Ramarao On Duty
Raviteja: మాస్ రాజా రవితేజ నటించిన రీసెంట్ మూవీ ‘ఖిలాడి’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద యావరేజ్ మూవీగా నిలిచింది. తన సక్సెస్ ట్రాక్ కంటిన్యూ చేయాలని చూసిన రవితేజకు ఈ సినిమాతో ఎదురుదెబ్బ తగిలింది. ఇక ఇప్పుడు తన నెక్ట్స్ చిత్రాలపైనే ఫోకస్ పెట్టాడు ఈ మాస్ హీరో. కాగా ప్రస్తుతం ఆయన వరుసగా రెండు చిత్రాలను తెరకెక్కిస్తూ బిజీగా ఉన్నాడు. ధమాకా అనే సినిమాతో పాటు రామారావు ఆన్ డ్యూటీ అనే చిత్రాన్ని కూడా ఒకేసారి తెరకెక్కిస్తున్నాడు రవితేజ. అయితే రామారావు ఆన్ డ్యూటీ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. దీనికి కారణం ఈ సినిమా టైటిల్‌తో పాటు ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్.
Raviteja : రామారావు ఆన్ డ్యూటీ.. రేపే ఆర్డర్స్..
ఓ సిన్సియర్ ప్రభుత్వ ఉద్యోగి పాత్రలో రవితేజ పర్ఫార్మెన్స్ ఈ సినిమాకే హైలైట్‌గా నిలవనుంది. ఇక ఈ సినిమాతో మరోసారి తన సక్సెస్ ట్రాక్‌ను రవితేజ కంటిన్యూ చేయడం ఖాయమని చిత్ర యూనిట్ భావిస్తోంది. కాగా శరత్ మండవ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో దివ్యాంశ, రజీషాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా నుండి చిత్ర యూనిటో ఓ సడెన్ సర్‌ప్రైజ్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. మార్చి 23న ఉదయం 10.08 గంటలకు ఓ మాసివ్ అనౌన్స్‌మెంట్ ఇస్తున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా ఓ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. దీంతో రామారావు ఆన్ డ్యూటీ నుండి ఎలాంటి అనౌన్స్‌మెంట్ రాబోతుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
పక్కా కమర్షియల్ అంశాలతో అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చే కథగా ఈ సినిమాను చిత్ర యూనిట్ తీర్చిదిద్దుతోంది. ఇక ఈ సినిమాలో రవితేజ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉండబోతుందని, ఇప్పటికే రిలీజ్ అయిన చిత్ర టీజర్ చూస్తే అర్థం అవుతోంది. ఈ సినిమాను శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ప్రొడ్యూస్ చేస్తుండగా సామ్ సిఎస్ సంగీతం అందిస్తున్నాడు. మరి మాస్ రాజా ఇవ్వబోతున్న మాసివ్ అనౌన్స్‌మెంట్ ఏమిటో తెలియాలంటే రేపటి వరకు వెయిట్ చేయాల్సిందే.
It’s DUTY time ?#RamaRaoOnDuty MASSive announcement tomorrow at 10:08 AM ??@RaviTeja_offl @directorsarat @itsdivyanshak @rajisha_vijayan @SamCSmusic @Cinemainmygenes @sathyaDP @sahisuresh @RTTeamWorks @SLVCinemasOffl pic.twitter.com/6Zy6ICUNNH
— SLV Cinemas (@SLVCinemasOffl) March 22, 2022