Chiru – Balayya: థియేటర్లు లేవు, అదిగో వస్తున్నాం.. ఇదిగో వస్తున్నాం అంటూ ఊరించిన సినిమా రిలీజ్లు కూడా లేవు. అందుకే సోషల్ మీడియాలో స్టార్ హీరోల సినిమాలకు సంబంధించి ఏ చిన్న టీజర్, సాంగ్ వీడియో రిలీజ్ అయినా.. దాన్ని తిప్పి తిప్పి తెగ చూసేస్తున్నారు ఆడియెన్స్. మరి అలా షార్ట్ టైమ్‌లోనే హై వ్యూయర్ షిప్ తెచ్చుకున్న వీడియోస్ మీద లెట్స్ హ్యావ్ ఎ లుక్.
ఒక పక్క లాక్డౌన్.. మరో పక్క కోవిడ్‌తో సినిమా ఇండస్ట్రీ ప్రస్తుతానికి బ్రేక్ తీసుకుంటోంది. రిలీజ్ ప్లాన్ చేసుకున్న సినిమాలు పోస్ట్ పోన్ అయిపోయాయి. తమ ఫ్యావరెట్ హీరోల సినిమాల రిలీజ్ కోసం వెయిట్ చేసిన ఆడియెన్స్ ఇప్పుడు సినిమాలు చూసే ఛాన్స్ లేకపోవడంతో టీజర్లు, పాటలు ఏం రిలీజ్ అయినా తెగ చూసేస్తున్నారు. బన్నీ-సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ మూవీ ‘పుష్ప’ కు సంబందించి రిలీజ్ చేసిన టీజర్ సోషల్ మీడియాలో వ్యూస్‌తో రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. లుక్‌తో సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన టీజర్.. లేటెస్ట్గా 7 కోట్ల వ్యూస్‌ని క్రాస్ చేసి బన్నీ క్రేజ్ ప్రూవ్ చేస్తోంది.
‘లవ్ స్టోరీ’ సినిమాలో సాయి పల్లవి ‘సారంగ దరియా’ సాంగ్ అయితే ఏకంగా 22 కోట్ల వ్యూస్ దాటిపోయింది. ఇప్పటికే తెలంగాణ సాంగ్స్ టాలీవుడ్లో ఫుల్ ఫేమస్ అవ్వడంతో ‘సారంగ దరియా’ పాట కూడా విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. శేఖర్ కమ్ముల డైరెక్షన్లో నాగ చైతన్య హీరోగా, సాయి పల్లవి హీరోయిన్గా రిలీజ్‌కు రెడీగా ఉన్న ‘లవ్ స్టోరీ’ సినిమాలో ‘సారంగ దరియా’ సాంగ్‌కి సాయి పల్లవి స్టెప్స్ కూడా యాడెడ్ ఎట్రాక్షన్ అయ్యాయి.
మెగాస్టార్ చిరంజీవి కూడా వ్యూస్‌తో వారెవ్వా అనిపిస్తున్నారు. రామ్ చరణ్, చిరంజీవి మల్టీ స్టారర్ సినిమా ‘ఆచార్య’ కు సంబంధించి రిలీజ్ చేసిన ‘లాహే లాహే’ సాంగ్ రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ క్రేజీ సాంగ్.. 5కోట్ల వ్యూస్‌ని చేరుకోవడానికి రెడీ అవుతోంది. సంగీత స్పెషల్ సాంగ్‌గా రిలీజ్ అయిన ఈ పాట రిథమిక్‌గా ఆడియెన్స్‌ని ఎట్రాక్ట్ చేస్తోంది.
యంగ్ హీరోలు, స్టార్ హీరోలకు సంబంధించిన వీడియోలు ట్రెండ్ అయ్యాయంటే ఓకే.. కానీ బాలయ్య బాబు వీడియోని కూడా తెగ చూసేస్తున్నారు జనాలు. బాలయ్య – బోయపాటి డైరెక్షన్లో తెరకెక్కుతున్న ‘అఖండ’ టీజర్ కూడా రికార్డులు క్రియేట్ చేస్తోంది. టీజర్ వీడియో.. 5 కోట్ల వ్యూస్ క్రాస్ చేసి యూట్యూబ్‌లో హవా నడిపిస్తోంది. యంగ్ హీరోలతో పోటీపడుతూ, ఇంకా సోలో హీరోగా కంటిన్యూ అవుతున్న బాలయ్య.. ‘అఖండ’ తో మరోసారి విశ్వరూపం చూపించబోతున్నారు.