Jio-Airtel 5G : దేశంలో మరిన్ని నగరాలకు జియో, ఎయిర్‌టెల్ 5G సర్వీసులు.. మీ ఫోన్‌లో 5G ఎలా యాక్టివేట్ చేయాలంటే?

Jio-Airtel 5G : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజాలు రిలయన్స్ జియో (Reliance) భారతీ ఎయిర్‌టెల్ (Airtel) 5G సర్వీసులు మరిన్ని భారతీయ నగరాలకు అందుబాటులోకి రానున్నాయి. టెలికాం కంపెనీలు 5G సర్వీసులను కొత్త నగరాలకు క్రమంగా 5G సపోర్టును విస్తరిస్తున్నాయి.

Jio-Airtel 5G : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజాలు రిలయన్స్ జియో (Reliance) భారతీ ఎయిర్‌టెల్ (Airtel) 5G సర్వీసులు మరిన్ని భారతీయ నగరాలకు అందుబాటులోకి రానున్నాయి. టెలికాం కంపెనీలు 5G సర్వీసులను కొత్త నగరాలకు క్రమంగా 5G సపోర్టును విస్తరిస్తున్నాయి. Airtel 5G ఇప్పుడు గురుగ్రామ్‌లో కూడా అందుబాటులోకి వచ్చింది. దీనిని గుర్గావ్ అని కూడా పిలుస్తారు. Jio 5G డిసెంబర్ నెలాఖరులోపు పశ్చిమ బెంగాల్ అంతటా విస్తరించేందుకు ప్లాన్ చేస్తోంది. పశ్చిమ బెంగాల్‌లో 5G సర్వీసులను దశలవారీగా అందుబాటులోకి తీసుకొచ్చింది.

సిలిగురిలోనే 5G సర్వీసులు మొదటి సిటీగా ఉంటుందని జియో ప్రకటించింది. ఉత్తర బెంగాల్, అస్సాం/ఈశాన్య ప్రాంతాలకు అందుబాటులోకి వస్తుంది. ఈ ఏడాది ముగిసేలోపు కోల్‌కతా మొత్తాన్ని కవర్ చేసేందుకు ప్లాన్ వేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. లేటెస్ట్ నెట్‌వర్క్ ఇప్పటికే ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, వారణాసి, నాథ్‌ద్వారా, బెంగళూరు, హైదరాబాద్‌లలో అందుబాటులో ఉంది. గురుగ్రామ్‌తో పాటు, ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, వారణాసి, చెన్నై, సిలిగురి, బెంగళూరు, నాగ్‌పూర్, పానిపట్ వంటి నగరాల్లో ఎయిర్‌టెల్ 5G ఇప్పటికే అందుబాటులో ఉంది.

Reliance Jio and Airtel expand 5G support to more Indian cities

గురుగ్రామ్‌లోని అన్ని ప్రాంతాలు 5G పొందడం లేదని టెలికాం కంపెనీ ధృవీకరించింది. ఎయిర్‌టెల్ యూజర్లు DLF సైబర్ హబ్, DLF ఫేజ్ 2, MG రోడ్, రాజీవ్ చౌక్, ఇఫ్కో చౌక్, అట్లాస్ చౌక్, ఉద్యోగ్ విహార్, నిర్వాణ కంట్రీ, గురుగ్రామ్ రైల్వే స్టేషన్, సివిల్ లైన్‌లు, ఆర్డీ సిటీ, హుడా సిటీ సెంటర్‌లో 5Gని పొందవచ్చు. గురుగ్రామ్ నేషనల్ సర్వీసుల్లో Airtel 5G ఇప్పుడు 10 నగరాల్లో అందుబాటులో ఉంది. Jio 5G ప్రస్తుతం 8 నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉంది.

రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ వచ్చే ఏడాది చివరి నాటికి దేశవ్యాప్తంగా 5Gని అందిస్తానని హామీ ఇచ్చారు. 5G మార్చి 2024 నాటికి అందరికీ చేరుతుందని ఎయిర్‌టెల్ నివేదించింది. ప్రస్తుతం ఎయిర్‌టెల్ కనిపిస్తోంది. Vodafone Idea (Vi) విషయానికొస్తే.. తన యూజర్లకు 5G సర్వీసులను ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో ఇంకా స్పష్టంగా తెలియలేదు. మార్చి 2024 నాటికి అన్ని నగరాల్లో 5Gని వ్యాప్తి చేస్తామని టెలికాం కంపెనీ తెలిపింది. ఇప్పటివరకు Vi 5G రోల్ అవుట్‌పై ఎలాంటి నివేదికలు లేవు.

ఫోన్‌లో 5Gని ఎలా యాక్టివేట్ చేయాలి?
మీ సిటీలో 5Gకి అర్హత సాధించిన తర్వాత, సెట్టింగ్‌ల విభాగంలో మొబైల్ నెట్‌వర్క్‌ను 5Gకి మార్చడం ద్వారా మీరు లేటెస్ట్ నెట్‌వర్క్‌ను పొందవచ్చు. మీరు సెట్టింగ్‌లలో 5G ఆప్షన్ చూడలేకపోతే.. మీ ఫోన్ 4G లేదా దానికి ఇంకా 5G సపోర్ట్ అప్‌డేట్ రాలేదని గమనించాలి.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Samsung Galaxy M04 : శాంసంగ్ గెలాక్సీ M04 స్మార్ట్ ఫోన్ వస్తోంది.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

ట్రెండింగ్ వార్తలు