Taj Mahal : తాజ్‌మహల్‌కు 500 మీటర్ల పరిధిలో ఉన్న అన్ని వ్యాపార కార్యకలాపాలను తొలగించండి : సుప్రీంకోర్టు ఆదేశం

తాజ్ మహల్ వైభవం కాపాడేందుకు సీప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తాజ్ మహల్ కట్టడానికి 500 మీటర్ల పరిధిలో ఉన్న అన్ని వ్యాపార కార్యకలాపాలను వెంటనే నిలిపివేయాలని ఆదేశించింది.

Taj Mahal :  ప్రపంచ ఏడు వింతల్లో ఒకటి తాజ్ మహల్. జీవితంలో ఒక్కసారైనా దానిని చూడాలని ప్రతీ ఒక్కరి కోరిక. తలపండిన దేశాధినేతలు సైతం దాని ముందు ఫోటో దిగాలని కలలు కంటారు. అలాంటి అద్భుత కట్టడం. అయితే ఇది ఒక వైపు మాత్రమే. తాజ్ మహల్ దగ్గర నుంచి ఎంతో అద్భుతంగా కనిపించినా .. దాని వద్దకు వెళ్లే మార్గం మాత్రం చాలా దుర్భరంగా ఉంటుంది. ఇరుకు సందులు, రోడ్డుపైకి చొచ్చుకు వచ్చిన షాపులు. తాజ్ మహల్ గురించి ఎంతో ఊహించుకుని వచ్చిన వారికి ఇక్కడ వేరే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

వాణిజ్యం పేరతో తాజ్ మహల్ అందానికి మకిలి పట్టిస్తున్నారు. దీంతో దాని వైభవానికి మచ్చ పడుతోంది. దీనిని అడ్డుకునేందుకు సుప్రీం కోర్టు రంగంలోకి దిగింది. తాజ్ మహల్ సరిహద్దు నుంచి 500 మీటర్ల వరకు అన్ని వాణిజ్య కార్యకలాపాలను నిలిపివేయాలని తెలిపింది. వెంటనే చర్యలు ప్రారంభించాలని ఆగ్రా డెవలప్ మెంట్ ఆథారికీ ఆదేశాలు జారీ చేసింది.

“నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

స్మారక చిహ్నం పశ్చిమ ద్వారం సమీపంలో చట్టవిరుద్ధంగా వ్యాపార కార్యాకలాపాలు జరుగుతున్నాయని, కోర్టు పాత ఉత్తర్వులను కూడా తీవ్రంగా ఉల్లంఘిస్తున్నారని న్యాయవాది ధింగ్రా ఫిర్యాదు చేశారు. దీనిపై సీనియర్ న్యాయవాది, అమికస్ క్యూరీ ఏడీఎన్ రావు వాదనలు వినిపించారు. 20 సంవత్సరాల క్రితం సుప్రీం కోర్టు ఇలాంటి తీర్పునే జారీ చేసిందని గుర్తు చేశారు.

సీనియర్ న్యాయవాది ఏడీఎన్ రావు వాదనలతో సుప్రీం కోర్టు బెంజ్ ఏకీభవించింది. తాజ్ మహల్ సరిహద్దు అంటే ప్రహారీ గోడ నుంచి 500 మీటర్ల లోపల అన్ని రకాల వ్యాపార కార్యకలాపాలను తొలగించాలని ఆగ్రా డెవలప్ మెంట్ అథారిటీని ఆదేశించింది. తాజ్ మహల్ వైభవాన్ని తగ్గించే ఎటువంటి పనులు సహించమని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది.

తాజ్‌మహల్‌ పేరు మార్పు ?

1984లో తాజ్ మహల్ క్రమంగా తన వైభవాన్ని కోల్పోవడాన్ని పర్యవరణ వేత్త ఎంసీ మెహతా గమనించారు. దీనిపై ఆయన సుప్రీం కోర్టులో ఓ ప్రజా ప్రయోజనవ వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ అపూరుప కట్టడం రక్షణకు చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో సుప్రీం కోర్టు రంగంలోకి దిగింది. ఆగ్రా పరిసర ప్రాంతాల్లో, సమీప జిల్లాలో పర్యావరణ కాలుష్యం ఎక్కువ. పంటలను తగులబెట్డం వల్ల పొగకు తాజ్ మహల్ రూపురేఖల్లో మార్పులు కనిపించడం మొదలైయ్యాయి.

ఆ సమయంలో ఇది గుర్తించిన సుప్రీం కోర్టు ఈ స్మారక చిహ్నానికి చుట్టూ సుమారు 10 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని తాజ్ ట్రాపీజియం జోన్ గా నిర్ణయించింది. ఈ జోన్ లో వాహనాల రాకపోకలపై కఠినమైన నిబంధనలు ఉంటాయి. చారిత్రక సమాధి సమీపంలో కలపను కాల్చడం, మున్సిపల్ వ్యర్థలు, వ్యవసాయ వ్యర్థాలను పడవేయడం చేయకూడదు.

సుప్రీం కోర్టు పర్యవేక్షణతో తాజ్ మహల్ వైభవాన్ని కాపాడేందుకు అనేక చర్యలు చేపట్టారు. యునెస్కో గుర్తింపు కూడా వచ్చింది. అయినా ఈ అపురూప కట్టడానికి గండాలు తప్పలేదు. దీంతో ఎప్పటికప్పుడు అత్యున్నత న్యాయస్థానం పరిస్థితులను గమనిస్తూనే ఉంది. 2000 సంవత్సరంలో కోర్టు ఆదేశాలతో అక్కడి దుకాణాలను 500 మీటర్ల అవతలికి తరలించారు. అయితే మళ్లీ అక్రమణలు మొదలయ్యాయి. తాజాగా మళ్లీ తాజ్ మహల్ సమీపంలో అక్రమణలు పెరగడంతో సుప్రీం కోర్టుకు ఫిర్యాదు అందింది. దీంతో అత్యున్నత న్యాయస్థానం ఈ సారి గట్టి వార్నింగే ఇచ్చింది.

Tajmahal Secrets : తాజ్ మహల్ మిస్టరీ వీడేనా? ఆ 22 గదులు తెరవటానికి కోర్టు గ్రీన్ సిగ్నల్‌ ఇస్తుందా?

 

 

ట్రెండింగ్ వార్తలు