Covid in China: కరోనాను అరికట్టేందుకు బారీకేడ్లు.. తోసుకువెళ్లిన ప్రజలు.. వీడియో వైరల్

జీరో కొవిడ్ విధానాన్ని పాటిస్తున్న చైనాలో కరోనా నిబంధనలు కఠినంగా ఉంటుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో ఎన్నడూలేని విధంగా పలు ప్రాంతాల్లో అధికారుల తీరుకి వ్యతిరేకంగా ప్రజలు నిరసన తెలుపుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా గవాంగ్‌జోవ్ లోని హైజూ జిల్లాలోని ఓ ప్రాంతంలో కరోనా కేసులు వెలుగులోకి రావడంతో అధికారులు ఆ ప్రాంతంలోని వారందరినీ నిర్బంధించడానికి ప్రయత్నించారు.

Covid in China: జీరో కొవిడ్ విధానాన్ని పాటిస్తున్న చైనాలో కరోనా నిబంధనలు కఠినంగా ఉంటుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో ఎన్నడూలేని విధంగా పలు ప్రాంతాల్లో అధికారుల తీరుకి వ్యతిరేకంగా ప్రజలు నిరసన తెలుపుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా గవాంగ్‌జోవ్ లోని హైజూ జిల్లాలోని ఓ ప్రాంతంలో కరోనా కేసులు వెలుగులోకి రావడంతో అధికారులు ఆ ప్రాంతంలోని వారందరినీ నిర్బంధించడానికి ప్రయత్నించారు.

ప్రజలను వారి ఇళ్లకు వెళ్లనివ్వకుండా వారిని ఒక్కచోటే క్వారంటైన్లో ఉంచాలని భావించారు. అందుకోసం శరవేగంగా బారీకేడ్లను ఏర్పాటు చేశారు. దీంతో అక్కడున్న ప్రజలు భయపడిపోయి బారీకేడ్లను పడేస్తూ ముందుకు కదిలారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ప్రజలను ఆపేందుకు అధికారులు, సిబ్బంది చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.

ఈ నిరసనలో ఎంతమంది ప్రజలు పాల్గొన్నారన్న విషయంపై స్పష్టతలేదు. గవాంగ్‌జోవ్ లో భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. వారిలో చాలా మందిలో లక్షణాలు కనపడడం లేదు. ప్రపంచం మొత్తం హెర్డ్ ఇమ్యూనిటీ కోసం ప్రయత్నిస్తుంటే, చైనా మాత్రం జీరో కొవిడ్ విధానాన్ని పాటిస్తుండడం, కఠిన ఆంక్షలు విధిస్తుండడం ఆ దేశ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

ట్రెండింగ్ వార్తలు