Kanhaiyalal
KanhaiyaLal: ఉదయ్‌పూర్‌లో కన్హయ్య హత్యకు పాల్పడ్డ నిందితుల్లో ఒకడైన రియాజ్ అత్తారీ రాజస్థాన్‌కు చెందిన బీజేపీ కార్యకర్త అని వెల్లడించారు కాంగ్రెస్ నేత పవన్ ఖేరా. దీనికి సంబంధించి ఆధారాలుగా ఫొటోలతో కూడిన కొన్ని ఫేస్‌బుక్ పోస్టులను పవన్ ఖేరా తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. రాజస్థాన్ మాజీ హోం మంత్రి, బీజేపీ నేత గులాబ్ చంద్ కటారియా పాల్గొన్న మైనారిటీ విభాగ కార్యక్రమాలకు రియాజ్ హాజరయ్యాడు. ఈ పోస్టుల ఆధారంగా ఉగ్ర నేపథ్యం కలిగిన వారితో బీజేపీకి ఉన్న సంబంధాలపై కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ సందర్భంగా పవన్ ఖేరా కొన్ని ప్రశ్నలు సంధించారు.
Vikram Doraiswami: యూకేలో భారత రాయబారిగా దొరైస్వామి
‘‘బీజేపీ నాయకులు దేశం మొత్తం మతపరమైన ఉన్మాదాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారా? మతపరమైన ఉన్మాదాన్ని వ్యాప్తి చేసేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలపై ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా ఇంకా మౌనంగా ఉంటారా? బీజేపీ తన అధికార ప్రతినిధుల ద్వారా విద్వేషాలు రెచ్చగొట్టి దేశంలో లాభపడాలని ప్రయత్నిస్తోందా? రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఈ కేసును ఎన్ఐఏకు బదిలీ చేయడాన్ని స్వాగతించారు. వాస్తవాలు బయటకి రాకముందే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ ఘటనను త్వరగా ఎన్ఐఏకు బదిలీ చేసిందా అనే ప్రశ్న తలెత్తుతోంది’’ అని పవన్ ఖేరా వ్యాఖ్యానించారు.