Accident (1)
Gujarat: గుజరాత్‌లోని అమ్రేలిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 9 మంది అక్కడికక్కడే మరణించారు. సమాచారం ప్రకారం, సావర్‌కుండ్లా బద్ధ గ్రామానికి సమీపంలో గుడిసెలో నిద్రిస్తున్న కార్మికులు చనిపోయారు. ఈ ఘటనలో మరికొంత మంది గాయపడ్డారు. అదుపు తప్పిన ట్రక్కు గుడిసెపైకి దూసుకుని వెళ్లగా గడిసెల్లో నిద్రిస్తున్న తొమ్మిది మంది చనిపోయారు.
అర్థరాత్రి మూడు గంటలకు ప్రమాదం..
లారీ గుడిసెను ఢీకొట్టడంతో అందులోని తొమ్మిది మంది అక్కడికక్కడే మరణించగా.. గాయపడిన నలుగురిని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, అర్థరాత్రి 3 గంటల సమయంలో ప్రమాదం జరిగింది. ఘోర ప్రమాదంలో గాయపడిన మరియు మరణించిన వారిని సావర్కుండ్లా సివిల్ ఆసుపత్రికి తరలించారు. నలుగురికి చికిత్స అందిస్తున్నారు.
స్టీరింగ్ నియంత్రణ కోల్పోయి..
ట్రక్కు డ్రైవర్ తన వాహనం స్టీరింగ్ మీద నియంత్రణ కోల్పోవడంతో ప్రమాదం చోటుచేసుకుంది. సంఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే, 108 మంది బృందం సంఘటనా స్థలానికి చేరుకుని, గాయపడినవారిని ఆస్పత్రికి తరలించారు. మృతుల అరుపులు, గాయపడినవారి ఆర్తనాదాలతో ఒక్కసారిగా ఆ ప్రాంతం దద్దరిల్లింది.