T20 World Cup: సెమీఫైనల్‌ మ్యాచ్‌కు ముందు రోహిత్ శర్మకు గాయం.. ఆందోళనలో టీమిండియా ..

మంగళవారం ఉదయం ప్రాక్టిస్ సెషన్ సందర్భంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు గాయమైంది. శర్మ ముంజేయిపై బలమైన దెుబ్బ తగలడంతో జట్టు సభ్యులు ఆందోళనకు గురయ్యారు. నెట్ షెషన్ లో భాగంగా ప్రాక్టిస్ చేస్తుండగా బంతి అతని కుడి ముంజేతికి తగిలింది.

T20 World Cup: టీ20 వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా రేపటి నుంచి సెమీఫైనల్స్ మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. రేపు న్యూజీలాండ్, పాకిస్థాన్ జట్లు తలపడనుండగా, 10న ఇంగ్లండ్ జట్టుతో భారత్ తలడనుంది. ఈ రెండు సెమీఫైనల్స్ లో గెలిచిన జట్లు 13న జరిగే ఫైనల్ మ్యాచ్ ఆడనున్నాయి. గురువారం ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా మ్యాచ్ ఆడిలైడ్‌లో జరగనుంది. సోమవారం టీమిండియా జట్టు ఆడిలైడ్ కు చేరుకుంది. మంగళవారం ప్రాక్టీస్ సెషన్ టీమిండియా ప్లేయర్లు పాల్గొన్నారు.

T20 World Cup-2022: సెమీఫైనల్ మ్యాచ్ కోసం అడిలైడ్ ఓవల్ చేరుకున్న టీమిండియా.. వీడియో

మంగళవారం ఉదయం ప్రాక్టిస్ సెషన్ సందర్భంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు గాయమైంది. శర్మ ముంజేయిపై బలమైన దెుబ్బ తగలడంతో జట్టు సభ్యులు ఆందోళనకు గురయ్యారు. నెట్ షెషన్ లో భాగంగా ప్రాక్టిస్ చేస్తుండగా బంతి అతని కుడి ముంజేతికి తగిలింది. రోహిత్ తీవ్ర‌నొప్పితో బాధపడ్డాడు. అతని వద్దకు వెంటనే ఫిజియో, మరికొందరు సహాయక సిబ్బంది వచ్చి దెబ్బ తగిలిన ప్రాంతాన్ని పరిశీలించి ఐస్ ప్యాక్ ను ఉంచారు. కొద్దిసేపు పర్యవేక్షణ తర్వాత రోహిత్ మళ్లీ ప్రాక్టిస్ చేసేందుకు ప్రయత్నించాడు. కానీ, కొద్దిసేపటికే తీవ్రనొప్పితో మధ్యలోనే వెళ్లిపోయాడు.

ప్రస్తుతం నొప్పితో బాధపడుతున్న రోహిత్.. ఇంగ్లాండ్ తో మ్యాచ్ కు సిద్ధమవుతాడా అనే ఆందోళన క్రికెట్ అభిమానుల్లో వ్యక్తమవుతోంది. టీమిండియా ఇప్పటికే పేసర్ జస్ప్రీత్ బుమ్రా, స్టార్ ఆల్-రౌండర్ రవీంద్ర జడేజా లేకుండా సెమీస్‌కు చేరుకుంది. సెమీఫైనల్‌లో మ్యాచ్‌కు ముందు రోహిత్ గాయంతో దూరంగా ఉంటే అది టీమిండియాకు పెద్ద దెబ్బే అని చెప్పొచ్చు.

ట్రెండింగ్ వార్తలు