RPF woman constable : రైల్వే ట్రాక్‌పై బలవన్మరణానికి ప్రయత్నించాడు.. మెరుపులా దూకి కాపాడిన ఆర్పీఎఫ్ మహిళా కానిస్టేబుల్

ఏమైందో ఏమో.. ఒక వ్యక్తి రైల్వే ట్రాక్‌పై తల పెట్టి బలవన్మరణానికి ప్రయత్నించాడు. వెంటనే అప్రమత్తమైన ఆర్పీఎఫ్ మహిళా కానిస్టేబుల్ ధైర్యంగా ట్రాక్ పైకి దిగి అతని ప్రాణాలు కాపాడింది. పశ్చిమ బెంగాల్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఆర్పీఎఫ్ ఇండియా పోస్ట్ చేసింది.

RPF woman constable

RPF woman constable : పశ్చిమ బెంగాల్ రైల్వే స్టేషన్ లో ఆర్పీఎఫ్ మహిళా కానిస్టేబుల్ ధైర్య, సాహసాలు ప్రదర్శించి ఓ వ్యక్తిని కాపాడింది. పుర్బా మేదినీపూర్ రైల్వే స్టేషన్ లో జరిగిన ఈ ఘటనను ఆర్పీఎఫ్ ఇండియా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

CRPF Exams: కేంద్ర ప్రభుత్వ చారిత్రాత్మక నిర్ణయం.. తెలుగులో సీఆర్పీఎఫ్ పరీక్షలు

ప్లాట్‌ఫామ్‌పై నిలబడ్డ ఓ వ్యక్తి అకస్మాత్తుగా కిందకు దిగి ట్రాక్ మీద తలపెట్టి పడుకున్నాడు. అతడిని చూసి అవతలి ప్లాట్‌ఫామ్‌పై ఉన్న ఆర్పీఎప్ కానిస్టేబుల్ సుమతి ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా పరుగున ట్రాక్ పైకి దిగి ఆ వ్యక్తిని దూరంగా లాగారు. వెంటనే ప్లాట్‌ఫామ్‌పై ఉన్న మరో ఇద్దరు కానిస్టేబుల్స్ కూడా సాయం అందించడంతో ఆ వ్యక్తిని కాపాడారు. సుమతి ట్రాక్ మీదకు రావడం ఒక్క క్షణం ఆలస్యం అయి ఉంటే ఆ వ్యక్తి ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని ఆర్పీఎఫ్ ఇండియా పోస్ట్ చేసింది. ‘ప్రయాణికుల భద్రత పట్ల ఆమెకున్న నిబద్ధతకు కుడోస్’ అనే శీర్షికతో షేర్ చేసిన ఈ వీడియో వైరల్ అవుతోంది. అందరూ కానిస్టేబుల్ సుమతి ధైర్య సాహసాల్ని మెచ్చుకుంటున్నారు.

Warangal : రైలు కింద పడిన మహిళను కాపాడిన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్‌

‘గొప్ప ప్రయత్నం, అభినందనలు’ అని ఒకరు.. ‘ఆమె ఉద్యోగం పట్ల గొప్ప అంకితభావం. అభినందనలు’ అని మరొకరు ప్రశంసించారు. ఇంటర్నెట్‌లో ఆర్పీఎప్ కానిస్టేబుల్ సుమతికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

ట్రెండింగ్ వార్తలు