RRR: టార్గెట్ 250.. దూసుకెళ్తున్న ఆర్ఆర్ఆర్!

స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన సంగతి తెలిసిందే......

Rrr Eyes On 250 Cr Club In Hindi

RRR: స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లు కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. ఇక ఆర్ఆర్ఆర్ రిలీజ్ రోజునే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకోవడంతో ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌గా అవతరించింది.

RRR: ఓటీటీలో ఆర్ఆర్ఆర్.. రీ ఎడిటింగ్ వెర్షన్ రిలీజ్ చేస్తారా?

పాన్ ఇండియా మూవీగా ఈ సినిమాను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా, సౌత్‌లోనే కాకుండా ఈ సినిమాపై నార్త్‌లోనూ అదిరిపోయే అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ చిత్రానికి బాలీవుడ్ జనం కూడా నీరాజనం పడుతుండటంతో.. అక్కడ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా ఇప్పటికే హిందీ బెల్ట్‌లో ఏకంగా రూ.200 కోట్ల మార్క్‌ను క్రాస్ చేసి అదిరిపోయే రికార్డును సొంతం చేసుకుంది. కాగా తాజాగా ఈ సినిమా అక్కడ రూ.250 కోట్ల మార్క్ వైపు పరుగులు పెడుతోంది.

RRR: జక్కన్న ఊహించిన దానికంటే తారక్ బెటర్ పర్ఫామెన్స్.. కామెంట్స్ వైరల్!

సోమవారం నాడు ఈ సినిమా హిందీలో రూ.3.5 కోట్లు కలెక్ట్ చేసి ఇంకా స్ట్రాంగ్‌గా రన్ అవుతున్నట్లు హింట్ ఇచ్చింది. దీంతో ఈ సినిమా ఏకంగా రూ.236 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టింది. అయితే ఈ వారంలో మరో రెండు పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ అవుతుండటంతో ఆర్ఆర్ఆర్ కలెక్షన్లపై ప్రభావం ఉంటుందని సినీ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. అయినా కూడా ఆర్ఆర్ఆర్ సినిమా హిందీ టోటల్ రన్‌లో రూ.250 కోట్ల మార్క్‌ను ఈజీగా దాటేస్తుందని వారు అంటున్నారు. తారక్, చరణ్‌ల పవర్‌ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాకు మేజర్ హైలైట్‌గా నిలవగా, కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందించాడు. అజయ్ దేవ్గన్, ఆలియా భట్, ఒలివియా మారిస్‌లు ఈ సినిమాలో ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.