Woman 23 Gives Birth To Daughter In Kyiv Underground Metro Station During Russian Invasion
Russia Ukraine War : రష్యా-యుక్రెయిన్ మధ్య యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. యుక్రెయిన్ రాజధాని నగరం కీవ్ రష్యా బలాగాల చేతిలోకి దాదాపు వెళ్లిపోయింది. నగరం మొత్తం సైనిక దాడులు..బాంబుల మోత, వైమానిక దాడులు మోతెక్కిపోతోంది. దీంతో ఎంతోమంది ప్రజలు మెట్రో అండర్ గ్రౌండ్ లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కు బిక్కుమంటూ తలదాచుకున్నారు.
యుద్ధ విమానాల సైరన్లతో కీవ్ నగరం చిగురుటాకులా వణికిపోతున్న సమయంలో ఓ గర్భిణికి పురిటినొప్పులు ప్రారంభమయ్యాయి.కాసేపటికి యుద్ధ వాతావరణం మధ్య బాంబులో మోత మధ్యం 23 ఏళ్ల గర్భిణి పండంటి బిడ్డకు జన్మినిచ్చింది. ప్రాణాలు దక్కించుకోవటానికి వెళ్లిన మెట్రో అండర్ గ్రౌండ్ గర్భిణికి ప్రసవం జరిగి ఓ బిడ్డను జన్మనిచ్చింది. బాంబుల మోత, క్షిపణుల హోరు, వైమానిక దాడుల సైరన్ల మోత ప్రసవించిన ఆమె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.
శుక్రవారం (ఫిబ్రవరి 25,2022) గత రాత్రి 8.30 గంటల సమయంలో అండర్‌గ్రౌండ్ మెట్రో స్టేషన్ అండర్ గ్రౌండ్ లో తలదాచుకున్న ఓ గర్భిణికి ప్రసావ వేదనతో బాధపడుతుంటడంతో వైద్య సిబ్బంది వచ్చి.. ఆమెకు సహకరించారు. ప్రసవం నొప్పుల్ని భరించలేక గర్భిణి పెద్ద పెద్దగా అరుస్తుంటే ఆ కేకలు విన్న యుక్రెయిన్ పోలీసులు పరుగుపరుగున వచ్చారు. వెంటనే ఆ గర్భణిని ఆస్పత్రికి తరలించారు.
అక్కడ ఆ మహిళ పండంటి పాపకు జన్మనిచ్చింది. రష్యా సేనల దాష్టీకంతో యుక్రెయిన్ లో రక్తపుటేరులు పారుతున్న సమయంలో ఓ చిన్నారి ఈ యుద్ద ప్రపంచంలోకి తన చిట్టి పాదాలతో అడుగుపెట్టింది. తల్లి బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని అధికారులు తెలిపారు.
ఈ విషయాన్ని టెటిగ్రామ్ యాప్‌లో కొందరు షేర్ చేశారు. మెట్రో స్టేషన్లనే బంకర్లుగా వాడుతున్న స్థానికులు ప్రస్తుతం టెలిగ్రామ్ యాప్ ద్వారా కమ్యూనికేట్ చేసుకుంటున్నారు. భయనక, దుర్భర పరిస్థితుల్లో పుట్టిన ఆశకిరణం మని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అండర్ గ్రౌండ్ మెట్రో రైళ్లు నడుస్తున్నాయి. ఫ్లాట్‌ఫామ్‌లను ఆవాసాలుగా మార్చుకుని బిక్కుబిక్కుమంటూ రోజులు గడుపుతున్నారు ఎంతోమంది ప్రజలు.
ప్రస్తుతం ఉక్రెయిన్‌లోని మెట్రో స్టేషన్‌లు, షాపులు, బార్‌లు, సబ్‌వే స్టేషన్‌లును షెల్టర్ హోమ్స్‌గా మరాయి. వేలాది మంది అందులోనే ఆశ్రయం పొందుతున్నారు. బాంబు దాడుల నుంచి రక్షించుకునేందుకు ఇవి ప్రజలకు ఉపయోగపడుతున్నాయి. ఉక్రెయిన్‌లోని ప్రధాన పట్టణమైన కీవ్‌లో మెట్రోతో పాటు బాంబ్ షెల్టర్, మరో 4500 షెల్టర్ హోమ్స్ ఉన్నాయి. అక్కడే ఎంతోమంది ప్రజలు తలదాచుకుంటున్నారు.
రష్యా దాడుల వల్ల ఇప్పటికే లక్ష మంది చెల్లాచెదురయ్యారు. పోలాండ్, మాల్డోవా, రొమేనియా, హంగేరి, స్లోవేకియా దేశాలకు ఉక్రెయిన్ శరణార్థులు వెళ్తున్నట్లు తెలుస్తోంది. గురువారం ఒక్క రోజే సుమారు 35వేల మంది పోలాండ్‌లోకి ప్రవేశించారు. సుమారు 50 లక్షల మంది ఉక్రెనియన్లు విదేశాలకు తరలివెళ్లే అవకాశాలు ఉన్నట్లు ఐక్యరాజ్యసమితి అంచనా వేస్తోంది.