Sachet And Parampara To Compose Music For Adipurush
Adipurush: ప్రభాస్ ‘ఆదిపురుష్’ మూవీకి బాలీవుడ్ మ్యూజిక్ డ్యుయో సాచెత్ తాండన్ – పరంపరా ఠాకూర్ మ్యూజిక్ అందిస్తున్నారని టాక్. ఓం రౌత్ దర్శకత్వంలో వచ్చిన ‘తన్హాజీ’ తో పాటూ ప్రభాస్ ‘సాహో’ లోని ‘సైయాన్ సైకో’ పాటకు హిట్ మ్యూజిక్ ఇచ్చింది వీళ్లిద్దరే.
‘ఫ్యామిలీ మ్యాన్ 2’ లో ఫైటింగులు చేసి ఫుల్‌గా పేరు సంపాదించుకుంది సౌత్ బ్యూటీ సమంత. అయితే ఇవన్నీ అంత ఈజీగా జరగలేదని, తను ఈ యాక్షన్ షూట్స్ కోసం ఎంత హోమ్ వర్క్ చేసిందీ.. ఎంత కష్టపడిందీ.. సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేసింది సమంత.
తనకు గుర్తింపు తీసుకొచ్చిన ‘ఫలక్ నుమా దాస్’ మూవీకి త్వరలోనే సీక్వెల్ రానుందని ప్రకటించాడు విశ్వక్ సేన్. ‘ఫలక్ నుమా దాస్’ ముహూర్తం షాట్ పోస్ట్ చేసిన విశ్వక్.. త్వరలోనే సినిమా స్టార్ట్ చేస్తామని అనౌన్స్ చేశాడు.
నిఖిల్, అనుపమా పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న సినిమా ‘18 పేజీస్’. ఈ మూవీ ఫస్ట్‌లుక్ మేకింగ్‌ని సోషల్ మీడియాలో షేర్ చేసాడు నిఖిల్. షూటింగ్ టైమ్‌లో అనుపమ చేసిన అల్లరిని వీడియో తీసి సరదాగా పోస్ట్ చేసాడు.
కార్తీక్ రత్నం, నవీన్ చంద్ర, సాయి కుమార్, కృష్ణ ప్రియ, శుభలేఖ సుధాకర్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘అర్ధ శతాబ్ధం’. రవీంద్ర పుల్లె డైరెక్ట్ చేసిన ఈ సినిమాను జూన్ 11న ఫస్ట్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ‘ఆహా’ లో రిలీజ్ చేయబోతున్నారు.