Sai Dharam Self Video After Bike Accident
Sai Dharam Tej: మెగా హీరో సాయిధరమ్ తేజ్ గతేడాది సెప్టెంబర్‌లో బైక్ యాక్సిడెంట్‌లో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. మాదాపూర్‌లో బైక్ స్కిడ్ అయ్యి తీవ్ర గాయాలపాలపైన తేజును, వెంటనే స్థానిక మెడికవర్ ఆసుపత్రిలో చేర్పించి, ఆ తరువాత అపోలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కాస్త కోలుకున్న తరువాత తేజుకు ఇంటి వద్దే చికిత్స ఇప్పిస్తూ వచ్చారు. అయితే తాజాగా ఈ హీరో తాను కోలుకున్నట్లు తన అభిమానులకు తెలిపేందుకు ఓ స్పెషల్ వీడియోను రిలీజ్ చేశాడు.
పూర్తిగా కోలుకున్న Sai Dharam Tej… ఫ్యాన్స్‌కు చిరంజీవి గుడ్‌న్యూస్
తనకు యాక్సిడెంట్ అయినప్పుడు తనను ఆసుపత్రిలో చేర్పించిన వ్యక్తికి, మెడికవర్, అపోలో ఆసుపత్రి వైద్యులకు, తన కుటుంబ సభ్యులకు, తన మేనమాలు చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపాడు. వారు చూపించిన ప్రేమతోనే తాను ఈరోజు ఇలా క్షేమంగా ఉన్నానంటూ తేజు చెప్పుకొచ్చాడు. ఇక తన అభిమానులకు ఓ గుడ్ న్యూస్ చెప్పేందుకే ఈ వీడియో చేస్తున్నట్లు తేజు తెలిపాడు.
Sai Dharam Tej : సినిమాలకు ఓకే చెప్పిన సాయి ధరమ్ తేజ్..
ఈ నెల 28న తన కొత్త సినిమా ప్రారంభం అవుతుందని.. సుకుమార్, బాబీలు ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నట్లు తేజు చెప్పుకొచ్చాడు. త్వరలోనే మళ్లీ అందరి ముందుకు వస్తానని తేజు పేర్కొన్నాడు. ఇక బైక్‌పై వెళ్లే ప్రతిఒక్కరూ తప్పక హెల్మెట్ ధరించాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. అయితే ఈ వీడియోలో తేజు ఇంకా నీరసంగానే కనిపిస్తుండటంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఏదేమైనా తమ అభిమాన హీరో ప్రమాదం నుండి కోలుకోవడం సంతోషంగా ఉందని మెగా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.