భర్తతో కలిసి సాహ‌స‌యాత్ర‌కు సమంత!

  • Publish Date - May 12, 2020 / 07:08 AM IST

టాలీవుడ్ సెలబ్రటీ కపుల్.. నాగచైతన్య, సమంత.. సుధీర్ఘకాలం ప్రేమించుకుని పెళ్లితో ఒక్కటైన ఈ ప్రేమ జంట.. ఎప్పుడూ సినిమాలతో బిజీగా గడిపేవారు. అయితే చాలాకాలం తర్వాత కరోనా కారణంగా గ్యాప్ రావడంతో ఇంట్లోనే ఉంటున్నారు. ఇంట్లోనే ఉంటూ ఎంజాయ్ చేస్తున్న ఈ యువజంట.. ఖాళీ స‌మ‌యాన్ని సోషల్ మీడియాలో కూడా ఎక్కువగా గడుపుతున్నారు. 

ఈ క్రమంలోనే త‌మ అభిమానుల కోసం వినోదాత్మ‌క‌మైన ఫోటోల‌ను, వీడియోల‌ను షేర్ చేస్తూనే ఉన్నారు. తాజాగా.. త‌మ ఫ్యాన్స్‌ కోసం త్రో బ్యాక్(ఫోటో) ఫోటోను పెట్టారు. సెల‌బ్రెటీలు త‌మ‌కు సంబంధించిన పాత ఫోటోల‌ను షేర్ చేస్తూ అభిమానుల‌ను అల‌రించే ప్ర‌య‌త్నం చేస్తున్న క్రమంలోనే అక్కినేని జంట అభిమానుల కోసం పాత ఫోటోను పంచుకున్నారు. 

స‌మంత అక్కినేని ఇన్‌స్టాగ్రమ్‌లో తాజాగా పోస్ట్ చేసిన ఫోటో తెగ వైర‌ల్ అవుతోంది. స‌మంత‌, ఆమె భ‌ర్త నాగ చైత‌న్య‌, త‌మ పెంపుడు కుక్క హ్యాష్‌తో క‌లిసి కారులో కూర్చున్న ఫోటో అది. అంతేకాకుండా ‘ఓ గొప్ప సాహ‌స‌యాత్ర‌కు సిద్ద‌మ‌వుతున్నాం’ అంటూ క్యాప్ష‌న్ కూడా అందులో పెట్టింది. ప్ర‌స్తుతం ఈ ఫోటో నెట్టింట్లో తెగ వైర‌ల్ అవుతోంది. ఇక ఈ ఫోటోకు కేవలం గంట‌ల వ్య‌వ‌ధిలోనే వ‌న్ మిలియ‌న్‌కు పైగా లైక్స్ వచ్చేశాయి. 

అయితే పాత ఫోటో అని అర్థం చేసుకోని కొందరు అభిమానులు మాత్రం ఇంట్లోనే ఉండండి మేడమ్.. Stay Home అంటూ కామెంట్లు చేస్తున్నారు. 

Read More: 

సోషల్ మీడియా “డీపీ”లు మార్చిన బాలీవుడ్ సెలబ్రిటీలు

బాయ్ ఫ్రెండ్ ను పరిచయం చేసిన సినీ నటి